తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన మీటింగ్ లో 27 అర్బన్ మున్సిపాలిటీల విలీనం, స్థానిక ఎన్నికలు తదితర కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల, చుట్టూ ఉన్న 27 అర్బన్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు నిర్ణయిస్తూ.. దీన్ని స్టడీ చేసి సమగ్రమైన రిపోర్టు అందించాలని కౌన్సిల్ ను ఆదేశించారు.
GHMCలో విలీనం కాబోయే కొత్త మున్సిపాలిటీలు ఇవే :
1. పెద్ద అంబర్ పేట
2. జల్ పల్లి
3. శంషాబాద్
4. తుర్కయాంజిల్
5. మణికొండ
6. నార్సింగ్
7. ఆదిభట్ల
8. తుక్కుగూడ
9. మేడ్చల్
10. దమ్మాయిగూడ
11. నాగారం
12. పోచారం
13. ఘట్కకేసర్
14. గుండ్ల పోచంపల్లి
15. తూముకుంట
16. కొంపల్లి
17. దుండిగల్
18. బొల్లారం
19. తెల్లాపూర్
20. అమీన్ పూర్
21. బడంగపేట్
22. బండ్లగూడ జాగీర్
23. మీర్ పేట
24. బోడుప్పల్
25. పీర్జాదీగూడ
26. జవహర్ నగర్
27. నిజాంపేట
ALSO READ : GHMC నిధుల వరద..
జీహెచ్ఎంసీ బయట, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసి లోకి విలీనం చేయాలని జీహెచ్ఎంసి కౌన్సిల్ ప్రతిపాదించడంతో.. దీన్ని స్టడీ చేసి సమగ్రమైన రిపోర్టు అందించాలని కౌన్సిల్ ఆదేశించింది. ORR లోపల జనాభా పెరిగిందని.. అన్ని మున్సిపాలిటీల్లో జనానికి మెరుగైన పౌర సేవలు అందించేందుకు.. మరింత అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు మంత్రి శ్రీథర్ బాబు.
