27 వేల టన్నుల యూరియా అందుబాటులో ఉంది : నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి

27 వేల టన్నుల యూరియా అందుబాటులో ఉంది : నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి
  •     కలెక్టర్​ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, వెలుగు: వానాకాలం సీజన్​ కోసం జిల్లాలో 27,203 టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని నిజామాబాద్​కలెక్టర్ ఇలాత్రిపాఠి తెలిపారు. సోమవారం మీడియాకు ప్రకటన రిలీజ్​ చేశారు. యూరియా నిల్వలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని, రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే నిజామాబాద్​లోనే ఎక్కువ స్టాక్​ ఉందన్నారు. 

యాప్ ​ద్వారా పూర్తి పారదర్శకంగా పంపిణీ చేస్తామని, సాగు విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా బుకింగ్ ​చేసుకోవాలని తెలిపారు. డీలర్​వద్ద ఏ స్టాక్​ ఎంత ఉందో తెలిపే బోర్డులు పెట్టిస్తామన్నారు. నాసిరకం, నకిలీ యూరియా, సీడ్ ​విక్రయాలు జరగకుండా స్పెషల్​ఆఫీసర్లు, తహసీల్దార్లతో తనిఖీలు చేయిస్తామన్నారు. కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో 146 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్​ వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలకు రిఫర్ ​చేశారు.