లాక్ డౌన్ కారణంగా 28మంది తెలంగాణ విద్యార్థులు మహారాష్ట్రాలో చిక్కుకున్నారు. అగ్రికల్చర్ హెల్త్ కేర్ ట్రైనింగ్ కోసం థానే జిల్లా కళ్యాన్ ప్రాంతానికి వెళ్లారు …కరీంనగర్ తో పాటు వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు. అయితే అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో దాదాపు 3 నెలలుగా ఆశ్రయం పొందారు. ఇప్పుడు సొంతూళ్లు వచ్చేందుకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నామని, తమకు తిండి కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

