రెండు వారాల్లో మూడు లక్షల కేసులు.. 9 లక్షలకు చేరిన కౌంట్‌

రెండు వారాల్లో మూడు లక్షల కేసులు.. 9 లక్షలకు చేరిన కౌంట్‌
  • 24 గంటల్లో 28,498 కేసులు
  • 533 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రెండు వారాల్లో 3లక్షల కేసులు నమోదయ్యాయి. దాదాపు 6 వేల మంది చనిపోయారు. 24 గంటల్లో 28,498 కేసులు నమోదయ్యాయని, 553 మంది చనిపోయారని హెల్త్‌ మినిస్ట్రీ చెప్పింది. దీంతో కేసుల సంఖ్య 9,06,752కి చేరింది. చనిపోయిన వారి సంఖ్య 23,72కి పెరిగింది. బాధితుల్లో 5,71,460 మంది కోలుకోగా.. 3,11,565 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 63.02 శాతం కాగా.. మరణాల రేటు 2.64 శాతంగా ఉంది. దేశంలో జులై 1 నుంచి ఇప్పటి వరకు 3,21,259 కేసులు నమోదు కాగా.. రెండు వారాల్లో 6,327 మంది బాధితులు చనిపోయారు. ఈ నెల 13 నాటికి దేశంలో దాదాపు కోటి 20 లక్షల శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌‌ ప్రకటించింది. ఇక రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మహారాష్ట్ర మొదటి స్థానంలోఉండగా.. తమిళనాడు, ఢిల్లీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.