బీఆర్​ఎస్​ బీఫామ్స్​మరో 29 మందికి

బీఆర్​ఎస్​ బీఫామ్స్​మరో 29 మందికి
  • ప్రగతిభవన్​లో అందజేసిన కేసీఆర్
  • ఇంకా అందుకోవాల్సినవాళ్లు 21 మంది

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఇంకో 29 మందికి పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్​సోమవారం ప్రగతి భవన్​లో బీఫామ్స్​ అందజేశారు. ఆదివారం 69 మందికి బీ ఫామ్స్​ అంద జేయగా..  కొత్తగా ఇచ్చిన వారితో కలిపి ఆ సంఖ్య 98కి చేరింది. ఇంకో 21 నియోజకవర్గాల అభ్యర్థులకు బీఫామ్స్​ అందజేయాల్సి ఉంది. వారికి మంగళవారం 
ఇచ్చే చాన్స్​ ఉంది. 

సోమవారం బీఫామ్స్​ అందుకున్నవాళ్లు:

కల్వకుంట్ల సంజయ్ (జగిత్యాల), డాక్టర్ ఎన్ . సంజయ్ కుమార్ (కోరుట్ల), కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), కోరుకంటి చందర్ (రామగుండం), పుట్ట మధు (మంథని), చింత ప్రభాకర్ (సంగారెడ్డి), మల్లారెడ్డి (మేడ్చల్), కేపీ వివేకానంద్ (కుత్బుల్లాపూర్), మాధవరం కృష్ణారావు (కూకట్​పల్లి), మంచిరెడ్డి కిషన్ రెడ్డి (ఇబ్రహీంపట్నం), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), టి. ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), కాలె యాదయ్య (చేవెళ్ల), కొప్పుల మహేశ్ రెడ్డి (పరిగి), మెతుకు ఆనంద్ (వికారాబాద్), ముఠా గోపాల్ (ముషీరాబాద్), కాలేరు వెంకటేశ్ (అంబర్​పేట్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్), పద్మారావు గౌడ్​(సికింద్రాబాద్), లాస్య నందిత (కంటోన్మెంట్), గొంగిడి సునీత (ఆలేరు), శానంపూడి సైదిరెడ్డి (హుజూర్​నగర్), డీఎస్ రెడ్యానాయక్ (డోర్నకల్), బానోత్ శంకర్ నాయక్ (మహబూబాబాద్), చల్లా ధర్మారెడ్డి (పరకాల), ఆరూరి రమేశ్ (వర్ధన్నపేట), గండ్ర వెంకట రమణారెడ్డి (భూపాలపల్లి), మాణిక్ ​రావు (జహీరాబాద్​).