
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్‌లోని ధృవ మేనేజ్మెంట్ కాలేజీలో సోమవారం పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ 29వ బ్యాచ్ ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. చీఫ్‌గెస్ట్‌గా ఒడిశాలోని వీర్ సురేంద్ర వర్సిటీ మాజీ వీసీ డాక్టర్ సాయిబాబారెడ్డి, ధృవ కాలేజీ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ ఎస్.ప్రతాప్ రెడ్డి, వైస్ చైర్పర్సన్ పుష్పలతారెడ్డి పాల్గొని స్టూడెంట్లను ఉద్దేశించి మాట్లాడారు. -