spy satellites:సరిహద్దుల్లో ఉపగ్రహ నిఘా బలోపేతం..300కోట్లతో 52 స్పై శాటిలైట్స్

spy satellites:సరిహద్దుల్లో ఉపగ్రహ నిఘా బలోపేతం..300కోట్లతో 52 స్పై శాటిలైట్స్

పహల్గాం దాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు..పాక్ లో ఉగ్రస్థావరాల లక్ష్యంగా భారత్ దాడులు..ఉగ్రమూకలను మట్టుబెట్టడంలో భారత్ సక్సెస్.. భారత్  ధాటికి బెంబేలెత్తిన పాకిస్తాన్..ట్రంప్ తో రాయబారం..కాల్పుల విరమణ..ఇది ఏప్రిల్ 22 పహల్గాం దాడి ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలు..పాక్ లో చొరబడి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడంతో, పాక్పై భారత్ పైచేయి సాధించడంలో మన సైన్యానికి మార్గం చూపించింది శాటిలైట్ వ్యవస్థ. అది స్వయంగా ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ కూడా చెప్పారు. 

 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలను బలిగొన్న పహల్గాం దాడి తర్వాత భారత్ , పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఉపగ్రహ నిఘా సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు చర్యలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఉపగ్రహ నిఘా సామర్థ్యాన్ని పెంచేందుకు శాటిలైట్ తయారీకి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించింది. అనంత్ టెక్నాలజీస్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్ ,ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్‌ లకు అప్పగించిన విషయం తెలిసిందే..అయితే శాటిలైట్ తయారీ వేగవంతం చేయాలని ఆ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 

2024 అక్టోబర్ లో స్పైశాటిలైట్ తయారీకి అంతరిక్ష ఆధారిత నిఘా 3(SBS3) మిషన్ కు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా కేబినెట్ కమిటీ (CCS) ఆమోదం తెలిపింది. షెడ్యూల్ ప్రకారం నాలుగేళ్లలో అంటే 2028 నాటికి 52 నిఘా ఉపగ్రహాలు(స్పై శాటిలైట్లు) తయారీకి 3బిలియన్ డాలర్ల బడ్జెట్ ను కేటాయించింది. గత కొద్దిరోజులుగా భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో శాటిలైట్ తయారీ షెడ్యూల్ కుదించింది. నాలుగేళ్లనుంచి 12నుంచి 18 నెలలకు కుదించింది. 

ఈ క్రమంలో షెడ్యూల్ ముందుగా నే అంటే 2026లోనే నిఘా ఉపగ్రహాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అభివృద్ది దశలో ఉన్న ఒక ఉపగ్రహం ఈ ఏడాది చివరిలోగా అందుబాటులోకి రానుంది. అనంత్ టెక్నాలజీస్ తయారు చేస్తున్న ఈ శాటిలైట్ ఇస్రో శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ (LVM3) ద్వారా గానీ, స్పేస్ X వెహికల్ ద్వారా అంతరిక్షంలోకి పంపించనున్నారు. 

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు ముదరకముందే, ఆపరేషన్ సింధూ ప్రారంభించడానికి ముందే రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) నిఘా ఉపగ్రహాల అభివృద్దిని వేగవంతం చేయాలని ఆదేశించింది. మే 7న జరిగిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా శాటిలైట్ డైరెక్షన్ తోనే పాకిస్తాన్ ,పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అంతటా విస్తరించి ఉన్న తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా దాడులు చేసింది భారత్. విజయవంతంగా పని పూర్తి చేసింది. భవిష్యత్తులో శాటిలైట్ నిఘా వ్యవస్థ అవసరాన్ని గుర్తు చేసింది.