దేవరగట్టు కర్రల యుద్ధంలో ముగ్గురి మృతి, 100 మందికి గాయాలు

దేవరగట్టు కర్రల యుద్ధంలో ముగ్గురి మృతి, 100 మందికి గాయాలు

విజయదశమి సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం మంగళవారం రాత్రి  (అక్టోబర్ 24) న  జరిగింది. సంప్రదాయాల్లో భాగంగా కర్రలు గాల్లోకి లేచాయి. పోలీసులు వద్దని ఎంత నచ్చజెప్పినా యథావిధిగా కర్రల సమరం కొనసాగింది.ఈ సమరంలో ముగ్గురు చనిపోగా..  100 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. నెరణికి, కొత్తపేట, నెరణికితండా, బిలేహాల్‌, ఆలూరు, ఎల్లార్తి, సుళువాయి గ్రామాల మధ్య కర్రల సమరం జరిగింది. 

దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్రల సమరంలో 100 మందికి పైగా గాయపడ్డారు. ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఆస్పత్రికి చెందిన బాల గణేష్ గా గుర్తించారు. కర్నూలులోని దేవరగట్టులో మంగళవారం రాత్రి (అక్టోబర్ 24)   జరిగిన  ఉత్సవాల్లో రెండు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.  భక్తులు ఇనుపరింగుల కర్రలతో ... కర్రల సమరానికి వచ్చారు. 

దేవరగట్టు కర్రల సమరాన్ని చూసేందుకు స్థానికులు కొంతమంది సమీపంలోని చెట్టు ఎక్కారు. అయితే, ప్రమాదవశాత్తు చెట్టు కొమ్మ విరిగిపడింది. అది అక్కడే ఉన్న గణేష్ అనే యువకుడు మీద పడడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ఘటనలో మరో వ్యక్తి కూడా మృతి చెందాడు.  ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందగా, 100 మందికి పైగా భక్తులు గాయపడినట్లుగా సమాచారం. . కాగా క్షతగాత్రులందరినీ ఆలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తరలించారు. 

 ఈ కర్రల సమరంలో వందల మంది తలలు పగిలాయి. రక్తం కారుతున్నా... నేటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ బన్నీ ఉత్సవం ఎప్పటి నుంచో కొనసాగుతున్న సంప్రదాయం అని స్థానికులు చెబుతుంటారు. ప్రతి ఏటా దసరా సమయంలో నిర్వహిస్తారు.ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగుతున్న సమయంలో కొంతమంది  దుండగులు కాగడాల దివిటీలను గాలిలోకి ఎగరేశారు. దీంతో గొడవ మొదలైంది. డిర్ర్‌ర్‌.. గోపరాక్‌.. అనే శబ్దాలతో దేవరగట్టు ప్రాంతం మార్మోగింది. వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ బన్ని ఉత్సవాన్ని మంగళవారం అర్ధరాత్రి నిర్వహించారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా యథావిధిగా కర్రల సమరం కొనసాగింది.

తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ మంగళవారం  (అక్టోబర్ 24) న అర్ధరాత్రి బన్నీ ఉత్సవాన్ని కొనసాగించారు. మరోసారి దేవరగట్టులో సంప్రదాయమే గెలిచింది. ఎన్నిసార్లు వారించిన కర్రల సమరం యధావిధిగా కొనసాగింది. ఏటా విజయదశమి రోజు అర్ధరాత్రి దేవరగట్టుపై వెలసిన మాళ మల్లేశ్వర స్వామి  కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలు మాళ ఈశ్వర స్వామిని వీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.

ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్‌, ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌లకు బండారు ఇచ్చి ఉత్సవానికి అనుమతి తీసుకున్నారు. అనంతరం పెద్దఎత్తున కేకలు వేస్తూ భక్తులు కొండపైకి చేరుకున్నారు. కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామికి మల్లమ్మతో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
 

ALSO READ:ఆమె బీజేపీ మహిళా నేత యాక్సిడెంట్ లో కాలి బూడిదయ్యారు..!

కర్రల సమరాన్ని అడ్డుకునేందుకు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కర్రల సమరం వద్దని కొన్ని రోజులుగా అవగాహన సదస్సులు నిర్వహించినా భక్తులు సంప్రదాయాలను కొనసాగించాల్సిందేనని పట్టుబట్టారు. పోలీసులు ఇల్లిల్లు తిరిగి కర్రలు స్వాధీనం చేసుకున్నా బన్ని ఉత్సవం నాటికి వేల మంది యువకుల చేతుల్లో కర్రలతో ప్రత్యక్షం అయ్యారు. ఉత్సవ విగ్రహాలను కాపాడుకునేందుకు కర్రలు అడ్డుపెట్టి దాడులకు దిగారు. గాయపడిన వారికి వైద్య సాయం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు