24 గంటల్లో ముగ్గురు చిన్నారుల మృతి

24 గంటల్లో ముగ్గురు చిన్నారుల మృతి

పశ్చిమ బెంగాల్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. సిలిగురి నగరంలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌ (NBMCH)లో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం లోపు ముగ్గురు పసికందులు మరణించారు.  అయితే దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 24 గంటల గ్యాప్‌లో ముగ్గురు చిన్నారులు మరణించారని ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఇంద్రజిత్ సాహా తెలిపారు. వీరి మృతికి కరోనా కారణం కాదని ఆయన వివరించారు. ముగ్గురిలో ఎవరికీ శ్వాస సమస్యలు గానీ, జ్వరం గానీ లేవన్నారు. కరోనా టెస్టుల్లోనూ పాజిటివ్ రాలేదని, వాళ్లు వేర్వేరు కారణాలతో మరణించారని తెలిపారు. అయితే ఆ ఒక్క రోజులోనే 13 మంది పిల్లలు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని సాహా చెప్పారు. అయితే ఇలా ఒక్కసారిగా 24 గంటల్లోనే వరుసగా ముగ్గురు చిన్నారులు మృతి చెందడంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.