హైదరాబాద్ లో రెండో రోజు 3 లక్షల 13 వేల 226 దరఖాస్తులు

హైదరాబాద్ లో రెండో రోజు 3 లక్షల 13 వేల 226 దరఖాస్తులు
  • గ్రేటర్​లోని ప్రజా పాలన కౌంటర్ల వద్ద రద్దీ
  • దరఖాస్తులు ఇచ్చేందుకు పోటెత్తిన జనం

హైదరాబాద్/మేడ్చల్/పద్మారావునగర్/ఎల్ బీనగర్/వికారాబాద్/పరిగి, వెలుగు: గ్రేటర్ సిటీ పరిధిలో రెండోరోజు ప్రజా పాలన కార్యక్రమం కొనసాగింది. శుక్రవారం 3 లక్షల 13 వేల 226 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రేషన్ కార్డులు, ఇతర దరఖాస్తులు 48 వేల 802 వచ్చాయన్నారు. రెండ్రోజుల్లో ప్రజా పాలనకు మొత్తం 4 లక్షల 98 వేల 428 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. 

మేడ్చల్ మండలంలోని 7వ, 23వ వార్డుల్లో, గౌడవెల్లి గ్రామంలో జరుగుతున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని కలెక్టర్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ అభిషేక్​ అగస్త్య పరిశీలించారు. రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం లక్షా 25 వేల 948 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో జరుగుతున్న ప్రజా పాలనను కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పెల్లిమడుగు గ్రామంలో జరుగుతున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. బన్సీలాల్ పేటలోని ప్రజా పాలన కౌంటర్​ను పీసీసీ మెంబర్ మర్రి ఆదిత్య రెడ్డి సందర్శించారు.