బిగ్​బజార్​ సమీపంలో మగశిశువు

బిగ్​బజార్​ సమీపంలో మగశిశువు

ఎల్బీనగర్, వెలుగు: నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు మగ శిశువును  వదిలివెళ్లిన ఘటన ఎల్బీనగర్ పీఎస్​పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అశోక్ రెడ్డి వివరాల ప్రకారం ఎల్బీనగర్ బిగ్ బజార్ సమీపంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు మగ శిశువును వదిలి వెళ్లారు. ఏడుపులు విన్న పక్క బిల్డింగ్ వాచ్ మెన్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు పసి బిడ్డను తీసుకెళ్లి చైల్డ్ వెల్ఫేర్ కు అప్పగించారు. శిశువు వయసు మూడు నెలలు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. వాచ్ మెన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.