
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) అమ్ములపొదిలో మరిన్ని రఫేల్ జెట్ విమానాలు చేరనున్నాయి. ఫ్రాన్స్ నుంచి ఇప్పటికే పలు రఫేల్ జెట్‌లు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో మూడు రఫేల్‌లు మన దేశానికి చేరుకోనున్నాయి. మరో 9 జెట్స్ ఏప్రిల్‌లో డెలివరీ కానున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన రఫేల్‌లు వచ్చే వారం మొదట్లో అంబాలాకు చేరుకోనున్నాయి. ఈ కొత్త రఫేల్ యుద్ధ విమానాల్లో ఐదింటితో నార్త్ బెంగాల్‌లోని హసిమరా ఫార్వర్డ్ బేస్ కార్యకలాపాలు మొదలుపెట్టనుందని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు. ఇండియా మొత్తంగా ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ జెట్‌లను రూ.59 వేల కోట్లకు ఆర్డర్ చేసింది. వీటిల్లో అంబాలా బేస్డ్ గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో 11 రఫేల్ జెట్స్‌ను ఉంచారు. వీటిని లడఖ్‌లో ఆపరేట్ చేస్తున్నారు.