ఏలూరు జిల్లా జైలులో ఖైదీల మధ్య ఘర్షణ కలకలం రేపింది. ఏలూరుకు చెందిన రౌడీషీటర్ జగదీష్ పై కొందరు ఖైదీలు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం ( డిసెంబర్ 19 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... ఇటీవల ఓ యువతిపై అత్యాచార కేసులో అరెస్టైన రౌడీషీటర్ జగదీష్ పై పలువురు ఖైదీలు జైల్లో దాడికి పాల్పడ్డారు. చిన్నగా మొదలైన గొడవ ఉధృతం అవ్వడంతో జైలర్ దృష్టికి వెళ్ళింది.
ఈ ఘటనపై ఏలూరు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జగదీష్ ను నడిరోడ్డుపై సంకెళ్ళేసి కోర్టుకు హాజరుపరిచారు పోలీసులు. అయితే.. జగదీష్ పై దాడికి పాల్పడింది ద్వారకా తిరుమలలో చోరీ కేసులో అరెస్టైన పోలవరపు నాగ దుర్గాప్రసాద్, గుత్తుల రవిగా గుర్తించారు పోలీసులు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏలూరు వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
