రోడ్లపై వాహనాలు వెళ్లాలి.. ఫుట్ పాత్ లపై జనం నడవాలి.. ఇది బేసిక్.. అంతేకాదు ఇది కామన్ సెన్స్. ఇది రూల్ కూడా.. ఇందుకు విరుద్ధంగా ఫుట్ పాత్ లపై బండ్లు.. అదేనండీ బైక్స్ వెళుతుంటే ఏం చేస్తాం.. కొందరు అయితే చూస్తూ ఉంటారు.. మరికొందరు అయితే వాళ్ల వెనక ఫాలో అయ్యి.. ఫుట్ పాత్ లపైకి బైక్స్ ఎక్కిస్తారు.. ఇండియాలో ఇది సహజం.. ప్రతి సిటీలో కనిపించే దృశ్యం.. ట్రాఫిక్ మన అందరికీ ఎదురయ్యే అనుభవం.. మనకెందుకులే అని ఎవరి వాళ్లు లైట్ తీసుకుని వెళ్లిపోతుంటాం.. మహారాష్ట్ర రాష్ట్రం పూణెలో జరిగిన ఓ ఘటన.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ వివరాలు మీ కోసం..
పూణె సిటీ.. మార్నింగ్, ఈవినింగ్ సహజంగా ఉండే ట్రాఫిక్ రద్దీ. పింప్రి -చించ్వాడ్ ఏరియా. కొంత మంది బైకర్స్.. ఫుట్ పాత్ లపైకి వచ్చేశారు. ఫుట్ పాత్ లపై బైక్స్ తో వెళుతున్నారు. ఆ సమయంలో ఫుట్ పాత్ లపై నడుస్తూ వస్తున్న ఓ విదేశీయుడు షాక్ అయ్యాడు. మనకెందుకులే అని ఊరుకోలేదు.. ఫుట్ పాత్ పైకి బైక్ తో ఎలా వస్తావ్.. వెళ్లు.. వెనక్కి వెళ్లు.. ఫుట్ పాత్ పై నుంచి బండి దింపు.. రోడ్డుపై వెళ్లు అంటూ అడ్డంగా నిలబడి.. ఫుట్ పాత్ పైకి వచ్చిన బైక్స్ అన్నింటినీ దారి మళ్లించాడు. దీంతో ఫుట్ పాత్ పైకి వచ్చిన బైకర్స్ అందరూ.. కిందకు దిగి మెయిన్ రోడ్డుపైకి ఎక్కి వెళ్లిపోయారు.
21 సెకన్లు ఉన్న ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ సంచలనం. కామన్ సెన్స్ అనేది ఎంత ముఖ్యమో ఈ వీడియో చెబుతోంది.. అందులోనూ ఓ విదేశీయుడికి ఉన్న కామన్ సెన్స్ మనకు లేదా.. మనకు మనం ప్రశ్నించుకోలేమా.. మనకు తెలియదా ఫుట్ పాత్ పై వెళ్లకూడదు అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఓ విదేశీయుడికి ఉన్న అవగాహన.. కామన్ సెన్స్.. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు ఎందుకు లేవు.. మనకు మనం ఎందుకు అనుకోలేము.. మనలో ఒకరు ఎందుకు ఇలా చేయలేరు అంటూ ప్రశ్నిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
ALSO READ : నార్త్ ఇండియా రెడ్ అలర్ట్ :150 విమానాలు రద్దు.. పొల్యూషన్, పొగ మంచుతో మనిషికి మనిషే కనిపించటం లేదు..!
ట్రాఫిక్ మన అందరికీ తెలుసు.. అయినా ఎందుకు ఫాలో అవ్వం.. లోపం ఎక్కడ ఉంది. ఓ విదేశీయుడు మన దేశంలో.. మనకు ట్రాఫిక్ రూల్స్ చెప్పటం.. మనం చెప్పించుకోవటం అనేది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఓ విదేశీయుడు చెబితే మనం అందరం తెగ చూస్తున్నాం.. అదే మనలో ఒకడు చెబితే చెప్పొచ్చాడులే అంటూ లైట్ తీసుకుంటాం కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పుడే యాక్సిడెంట్స్ తగ్గుతాయి.. రాంగ్ రూట్ ప్రమాదాలు తగ్గుతాయి.. ట్రాఫిక్ పై అవగాహన ఉన్నప్పుడే సురక్షిత ప్రయాణం ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు నెటిజన్లు.
ఏదిఏమైనా ఓ విదేశీయుడి.. మన పట్టణంలో.. మనకు ట్రాఫిక్ రూల్స్ నేర్పించటమే కాదు.. అడ్డంగా నిలబడి అమలు చేయించటం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో..
🚨 A foreigner is forcing riders to move out of footpath in Pune. 🙏 pic.twitter.com/XYIqB9AzVs
— Indian Tech & Infra (@IndianTechGuide) December 19, 2025
