పొగమంచు, పొల్యూషన్ తో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఢిల్లీ, యూపీ, పంజాబ్, హర్యానా , ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు దట్టమైన పొగమంచు విజుబులిటీ పూర్తిగా తగ్గింది. మనిషికి మనిషే కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇంకా వాహనాల పరిస్థితి దారుణం.. రహదారులు మొత్తం మంచు పొగకమ్మేయడంతో వాహనాలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విజుబులిటీ లేకపోవండంతో పలు విమానాలు రద్దు అయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కట్టడికి గ్రాఫ్ 4 చర్యలు అమలు చేస్తున్నారు అధికారులు.
IMD ప్రకారం..ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో చాలా దట్టమైన పొగమంచు ఏర్పడటంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్ కూడా ఇదే పరిస్థితి. డిసెంబర్ 19, 20 తేదీలలో పంజాబ్, ఉత్తరాఖండ్ ,బీహార్ అంతటా, ఉత్తరప్రదేశ్ , హర్యానాలో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు ఉండే అవకాశం ఉంది. రాబోయే రెండు మూడు రోజులు పొగమంచు పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. దీంతో విజుబులిటీ తగ్గడంతో ప్రయాణ ఆలస్యం ,రహదారి భద్రతపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.
ఇక లోవిజుబులిటీతో ఉత్తరాది రాష్ట్రాల్లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు అంతర్జాతీయ విమానాలు సహా 79 విమానాలు రద్దు చేశారు ఎయిర్ పోర్టు అధికారులు.
మరోవైపు ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో పొల్యూషన్ రికార్డు అవుతోంది. ఆనంద్ విహార్ లో సహా ఢిల్లీలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగ కప్పేసింది. ఢిల్లీ -ఎన్సీఆర్అంతటా పెరుగుతున్న పొల్యూషన్ తో గ్రాప్ 4 కింద నియంత్రణ చర్యలు చేపట్టింది కమిషన్ ఫర్ ఎయిర్ క్వాటిలీ మేనేజ్ మెంట్.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం.. ఘాజీపూర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 442, ఐటీఓలో 409 , పాలంలో 447 గా నమోదు అయింది. ఈ ప్రాంతాలను ప్రమాదకర పొల్యూషన్ ప్రాంతాలుగా గుర్తించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ మొత్తం AQI 387 గా నమోదైంది.ఇది అత్యంత పేలవమైన గాలి నాణ్యత.. అంటే అత్యంత ప్రమాదకరమైన స్థితి.
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంతో ఆరోగ్య ప్రమాదం ఉన్నందున దేశరాజధాని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు, ఊపిరితిత్తుల సమస్యల ఉన్నవారు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదని, రానున్న మరో మూడు రోజులు ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగునున్నందుకు జాగ్రత్తగా అధికారులు హెచ్చరించారు.
