మంటల్లో చిక్కుకున్న జిప్సీ.. ముగ్గురు జవాన్లు మృతి

V6 Velugu Posted on Mar 25, 2021

గంగానగర్: సైనికులు ప్రయాణిస్తున్న వాహనం మంటల్లో చిక్కుకోవడంతో పలువురు జవాన్లు మృత్యువాత పడిన ఘటన రాజస్థాన్‌‌లోని గంగానగర్‌‌లో గురువారం చోటుచేసుకుంది. గంగానగర్ జిల్లా, రాజియాసర్ ఏరియాలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ‘ఆర్మీ జిప్సీ తిరగబడి మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో జిప్సీలో ఉన్న వారిలో ఐదుగురు జవాన్లు గాయాలతో బయటపడ్డారు. కానీ మరో ముగ్గురు మాత్రం  బయటకు రాలేక వాహనంలోనే చనిపోయారు’ అని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌‌హెచ్‌‌వో) విక్రమ్ తివారీ చెప్పారు. బాధితులను ఆస్పత్రిలో చేర్పించామని, వారికి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. 
 

Tagged vehicle, fire, Soldiers, dead, Injured, army, overturns, in Rajasthan

Latest Videos

Subscribe Now

More News