దాంపూర్ సెంటర్​లో 3 వేల గన్నీ బ్యాగులు మాయం

దాంపూర్ సెంటర్​లో 3 వేల గన్నీ బ్యాగులు మాయం
  • బీఆర్ఎస్​కు చెందిన ఓ దళారికి ఇచ్చినట్లు సమాచారం

జైపూర్(భీమారం), వెలుగు: భీమారం మండలం దాంపూర్ లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ నిర్వాహకులు దళారులతో కుమ్మక్కైనట్లు తెలుస్తోంది. సెంటర్​లోని 3 వేల గన్నీ బ్యాగులు మాయమైనట్లు సమాచారం. పోతనపల్లి గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన దళారితో సెంటర్ నిర్వాహకులు కుమ్మక్కై.. మరో చోట ధాన్యం కొనుగోలు చేసేందుకు గన్నీ బ్యాగులు అక్కడికి సప్లై చేసినట్లు తెలిసింది.

ఆ గన్నీ బ్యాగుల విలువ సుమారు రూ.లక్ష పైగా ఉంటుంది. ఈ విషయంపై మంచిర్యాల సివిల్ సప్లై డీఎం గోపాల్ ను వివరణ కోరగా.. వరి ధాన్యం అమ్మేందుకు గన్నీ బ్యాగులు తీసుకున్నవారి వివరాలు సివిల్ సప్లై ఆఫీస్​లో నమోదు చేసుకొని ఇస్తున్నామని చెప్పారు. గన్నీ బ్యాగుల్లో అవకతవకలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.