మీరు హైరైజ్ అపార్ట్ మెంట్స్ లో ఉంటున్నారా.. మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి.. లేకపోతే..

మీరు హైరైజ్ అపార్ట్ మెంట్స్ లో ఉంటున్నారా.. మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి.. లేకపోతే..

మహారాష్ట్ర రాష్ట్రం.. ముంబై సిటీ శివార్లలోని నలసోవరా ఏరియా.. ఓ గేటెడ్ కమ్యూనిటీ.. ఇక్కడ హైరైజ్ టవర్స్ ఉన్నాయి.. ఈ బిల్డింగ్ లో జరిగిన ఘటన ఇప్పుడు దేశాన్ని కదిలించింది.. ఈ ఘోర ఘటనలో తప్పు ఎవరిదీ కాకపోయినా మూడేళ్ల చిన్నారి ప్రాణం అయితే పోయింది.. షాకింగ్ కు గురి చేసిన ఈ ఘటన విజువల్స్ చూస్తుంటే.. మైండ్ బ్లాంక్ అవుతుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర పాల్గర్ జిల్లాలోని నలసోపారా తూర్పు ప్రాంతంలోని ఓ హైరైజ్ టవర్స్ లో నివసిస్తుంది ఓ కుటుంబం నివసిస్తుంది. ఇదే బిల్డింగ్ లో వారి బంధువులు కూడా ఉన్నారు. 2025, జూలై 22వ తేదీ రాత్రి మూడేళ్ల కుమార్తెను తీసుకుని ఆ తల్లి అదే బిల్డింగ్ లోని బంధువుల ప్లాట్ కు వెళ్లింది. కాసేపు మాట్లాడిన తర్వాత.. తిరిగి ఇంటికి వెళుతూ ప్లాట్ నుంచి బయటకు వచ్చింది. కారిడార్ లో చెప్పులు వేసుకునేందుకు.. చిన్నారిని చెప్పుల స్టాండ్ పై కూర్చోబెట్టింది తల్లి. తను రెండు అడుగులు ముందుకు వేసి తన షూ వేసుకుంటుంది ఆ తల్లి..

సరిగ్గా ఈ సమయంలో చెప్పుల స్టాండ్ పై కూర్చున్న మూడేళ్ల చిన్నారి.. చెప్పుల స్టాండ్ పైకి ఎక్కి.. వెనకే ఉన్న కిటికీపై కూర్చోవటానికి ప్రయత్నించింది. అలా కూర్చుంటున్న చిన్నారి వెనక్కి పడిపోయింది. 12వ అంతస్తు నుంచి కింద పడింది.. తలకు గాయమైంది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు చెప్పారు డాక్టర్లు. 

ఈ ఘటన అంతా ఆ బిల్డింగ్ కారిడార్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. చిన్నారిని చెప్పుల స్టాండ్ పై కూర్చోబెట్టటం.. ఆ పాప పైకి ఎక్కి కిటికీ దగ్గర కూర్చోవటానికి ప్రయత్నిస్తూ కింద పడిపోవటం.. ఆ తర్వాత ప్లాట్ లోని అందరూ పరుగులు తీయటం అంతా 30 సెకన్లలో జరిగిపోయింది.. 

ఈ ఘటనపై నైగావ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇందులో తల్లి తప్పు కూడా లేదని.. ఎవర్నీ బాద్యులను చేస్తాం అంటూ ఆ తండ్రి చెప్పుకొచ్చాడు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని.. కావాలని చేసింది కాదని చెప్పుకొచ్చాడు ఆ తండ్రి. పోలీసులు మాత్రం క్రిమినల్ ప్రొసీజన్ కోడ్ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

ఈ ఘటన హైరైజ్ టవర్స్ లో నివాసం ఉండే పిల్లల భద్రత, రక్షణ చర్యలపై చర్చకు దారి తీసింది. ఇటీవల కాలంలో సిటీల్లోనే కాదు చిన్న పట్టణాల్లోనూ 20, 30, 40, 50 అంస్తుల టవర్స్ కడుతున్నారు.. ఈ క్రమంలోనే ఈ ఘటన చర్చనీయాంశం అయ్యింది.