
- ఓవర్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న వెహికల్స్
- 80 నుంచి 100 కిలో మీటర్లకు తగ్గని వేగం
- వాహనాలు ఢీకొని గాయపడుతున్న వణ్యప్రాణులు
- స్పీడ్ కంట్రోల్‌పై పట్టించుకోని ఫారెస్ట్ ఆఫీసర్లు
జన్నారం, వెలుగు: కవ్వాల్టైగర్జోన్లో వెహికల్స్ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్నాయి. ఏ వెహికల్ అయినా గంటకు 80 –100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నాయి. గంటకు 30 కిలోమీటర్ల స్పీడ్రూల్స్ఉన్నా ఎవరూ పాటించడం లేదు. వాహనదారులకు కనిపించేలా ఫారెస్టులో బోర్డులు ఏర్పాటు చేసినా పట్టించుకో కుండా వెళ్లిపోతున్నారు. వెహికల్స్స్పీడ్కంట్రోల్పై ఫారెస్టు ఆఫీసర్లు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పడం తప్ప ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్నవారిపై ఎలాంటి యాక్షన్తీసుకోవడం లేదు.
వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు
వెహికల్స్ ఓవర్ స్పీడ్‌తో వెళ్తుండుగా వన్యప్రాణులు ముప్పు పొంచి ఉంది. రోడ్డుకు ఇరువైపులా అడవి విస్తరించి ఉండడంతో జంతువులు రోడ్డు దాటే క్రమంలో వెహికల్స్స్పీడ్కారణంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వాహనాల రాకపోకలతో పాటు రాత్రివేళల్లో వెహికల్స్ సౌండ్, లైటింగ్‌తో జంతువులు బెదిరిపోతున్నాయి. కొన్నిరకాల వణ్యప్రాణులు రాత్రిపూట మాత్రమే ఆహారం కోసం బయట సంచరిస్తుంటాయి. వాహనాల కారణంగా స్వేచ్ఛగా తిరగడానికి ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటివరకు ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి. ఎన్ని జంతువులు చనిపోయాయనే రికార్డు ఫారెస్ట్డిపార్ట్మెంట్ వద్ద లేకపోవడం వన్యప్రాణుల రక్షణపై అధికారుల తీరుకు ఏంటో తెలుస్తుంది.
వాహదారులకూ గాయాలు
వాహనదారులు స్పీడ్ గా జంతువులను ఢీకొట్టి గాయపడుతున్నారు. ఎదురుగా వణ్యప్రాణులు వచ్చినప్పుడు స్పీడ్కంట్రోల్చేయలేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల కింద మంచిర్యాలకు చెందిన దంపతులు బైక్‌పై జన్నారం వెళ్తుండగా తపాల్పూర్సమీపంలో వన్యప్రాణి అడ్డురావడంతో తప్పించబోయి కల్వర్టును ఢీకొట్టి పడిపోయారు. భార్య చనిపోగా భర్త గాయపడ్డాడు. మహ్మదాబాద్సమీపంలో ఆటోకు అడవి పంది అడ్డురావడంతో బోల్తాపడింది. నలుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. జన్నారం డీర్పార్క్సమీపంలో అడవిపందిని తప్పించబోయి ఆటో పల్టీ కొట్టటడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ఫారెస్ట్ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
టైగర్ జోన్లో ఎన్నో రూల్స్
2012లో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏర్పాటైంది. జన్నారం మీదుగా మంచిర్యాల-, నిర్మల్, మంచిర్యాల- ఆదిలాబాద్రోడ్లు ఫారెస్ట్ కోర్ఏరియా నుంచి వెళ్తాయి. ఆయా రూట్లలో ఎటూ 60 కిలోమీటర్ల పైనే దట్టమైన అడవి విస్తరించి ఉంది. వన్యప్రాణుల రక్షణ కోసం ఫారెస్టు డిపార్ట్మెంట్ఎన్నో రూల్స్అమలు చేస్తుంది. ఎప్పటినుంచో భారీ వాహనాల రాకపోకలను నిషేధించింది. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వెహికల్స్రాకపోకలపై నియంత్రణ ఉన్నా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు.
ఫారెస్ట్ రూల్స్‌తో ఇబ్బందులు పడుతున్నామని కోర్ ఏరియా పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ఆందోళనలు చేయడంతో ఫారెస్టు ఆఫీసర్లు కొంత వెనక్కు తగ్గారు. ముఖ్యంగా వన్యప్రాణుల సంచారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 30 కిలోమీటర్ల స్పీడ్లిమిట్ను అమలు చేస్తున్నారు. కానీ దీనిని ఎవరూ ఫాలో కావడం లేదు. అప్పుడప్పుడు ఫారెస్టు ఆఫీసర్లు నాకాబందీ నిర్వహించి వెహికల్స్చెక్ చేస్తూ స్పీడ్ లిమిట్‌పై వాహనదారులకు చెప్తున్నారు. కానీ, స్పీడ్ గా వెళ్లి వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.