మరికల్ మండలంలోని 30 క్వింటాళ్ల పత్తి దగ్ధం

మరికల్ మండలంలోని  30 క్వింటాళ్ల పత్తి దగ్ధం

మరికల్, వెలుగు: మండలంలోని చిత్తనూర్​ గ్రామానికి చెందిన శ్రీనివాస్​కు చెందిన 30 క్వింటాళ్ల పత్తి కాలిపోయింది. తన చేనులో పండించిన పత్తిని ఇంట్లో ఓ గదిలో నిల్వ ఉంచాడు. ఆదివారం విద్యుత్​ షార్ట్​ సర్క్యూట్​తో పత్తితో పాటు ఇంట్లో ఉన్న నగదు, ఇతర వస్తువులు కాలిపోయాయి. 

ఇంటి పై భాగం సైతం కాలిపోయింది. రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని గ్రామస్తులు తెలిపారు. నష్టపోయిన రైతును ఆదుకోవాలని వారు కోరారు. విషయం తెలుసుకున్న ఆర్ఐ సుధాకర్​రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు.