తెలంగాణలో 20 రోజుల్లో 30 వేల కేసులు

తెలంగాణలో 20 రోజుల్లో 30 వేల కేసులు

రాష్ట్రంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్
మొత్తం కేసుల్లో 63.6 శాతం ఈ నెలలోనే నమోదు
ప్రైమరీ కాంటాక్ట్స్ ట్రేస్‌ చేయట్లేదు
జిల్లాల్లోనూ భారీగా కేసులు
మరణాలు భారీగానే ఉన్నా.. ఒక్క శాతమే అంటున్న సర్కార్

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి లేదని మొదటి నుంచి చెబుతూ వచ్చింది సర్కారు. టెస్టులు సరిగ్గా చేయకుండా రోజూ 3 కేసులు.. 5 కేసులు.. 10 కేసులు అంటూ ప్రకటించింది. అయితే రాష్ర్టంలో టెస్టులు, ట్రీట్‌మెంట్ విషయంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా వ్యతిరేకత రావడంతో టీఆర్ఎస్ సర్కారు వెనక్కి తగ్గింది. టెస్టుల సంఖ్యను పెంచింది. దీంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి 21 వరకు కేవలం 20 రోజుల్లోనే 30,348 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఈ నెలలోనే హయ్యెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు రికార్డయ్యాయి. టెస్టులు చేసే కొద్దీ కేసులు పెరిగిపోతున్నాయి. కేసుల సంఖ్యను సర్కారు తగ్గించి చెబుతోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంతో పోలిస్తే మరణాల రేటూ పెరిగింది. మొన్నటిదాకా గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌ లోనే పరిమితమైన కేసులు ఇప్పుడు జిల్లాలకు కూడా పాకడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ నెలలోనే సగానికి పైగా కేసులు
రాష్ట్రంలో మార్చి 2న తొలి కేసు నమోదైంది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 26 నాటికి కేసులు 1001కి చేరాయి. మే 26 నాటికి 2 వేలకు చేరాయి. కేసుల సంఖ్య ఒకటి నుంచి వెయ్యికి చేరడానికి 56 రోజులు.. వెయ్యి నుంచి 2 వేలకు చేరడానికి నెల రోజులు పట్టింది. జూన్ ఒకటో తేదీ నాటికి 2,792 కేసులు నమోదయ్యాయి. జూలై ఒకటి నాటికి 17,357కి చేరాయి. అప్పటి నుంచి 20వ తేదీ వరకు కొత్తగా 30,348 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 63.6 % కేసులు 20 రోజుల్లోనే నమోదయ్యాయి.

టెస్టులు పెరిగే కొద్దీ..
రాష్ట్రంలో ఫిబ్రవరి నుంచి మే వరకు కరోనా టెస్టులు పెద్దగా చేయలేదు. ఈ 5 నెలల్లో 31,092 టెస్టులు మాత్రమే చేశారు. టెస్టులు తక్కువగా చేయడంతో ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొంత మంది కోర్టు గడప తొక్కారు. ఇదే విషయమై అనేక సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో సర్కారు టెస్టుల సంఖ్య పెంచుకుంటూ పోతోంది. జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 57,471 టెస్టులు చేయగా, 13,641
కేసులు రికార్డయ్యాయి. ఈ నెలలో అత్యధికంగా టెస్టులు చేశారు. 21వ తేదీ వరకు 2,00,280 టెస్టులు చేశారు.

జిల్లాలకు స్ప్రెడ్ అయితాంది
మొన్నటిదాకా పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ శాతం గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌ పరిధిలోనే నమోదయ్యాయి. జిల్లాల్లో ఒకటి రెండు మినహా ఎక్కడా పెద్దగా నమోదు కాలేదు. అయితే సిటీలో పని లేక చాలా మంది సొంతూర్లకు వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో చాలా మందికి అప్పటికే వైరస్ సోకింది. వారి నుంచి కరోనా జిల్లాలకు పాకింది. ప్రస్తుంతం రాష్ట్రంలో 29 జిల్లాల్లో కరోనా కేసులున్నాయి. ఈ నెల 21న ఒక్కరోజే జిల్లాల్లో 727 కేసులు నమోదుకావడం గమనార్హం.

డెత్ రేట్ ఒక శాతం లోపేనంట
ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న బులిటెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరణాల సంఖ్య చూసి డాక్టర్లే ఆశ్చర్య పోతున్నారు. రోజూ తమ కళ్లముందే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుంటే బులిటెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం చేర్చడం లేదని చెబుతున్నారు. ఆరోగ్యశాఖ బులిటెన్‌ ప్రకారం ఈనెల 21వ తేదీ నాటికి 429 మంది కరోనా వల్లచనిపోయారు. ఇది మొత్తం కరోనా బాధితుల్లో 0.89 శాతం. దేశంలో ఏ రాష్ట్రంలో నైనా కరోనా డెత్ రేటు 2 నుంచి 4 శాతం ఉంది. మన రాష్ట్రంలో మాత్రం ఒక శాతం లోపే ఉండటం గమనార్హం.

ట్రేస్‌ చేస్తలేరు
కేసులు పెరుగుతున్నా సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌మాత్రం ప్రైమరీ కాంటాక్ట్ లను ట్రే‌స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం లేదు. టెస్టుల విషయంలో సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్లక్ష్యం చేస్తే.. ట్రేసింగ్‌ విషయంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. పాజిటివ్‌ వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్ లకు సకాలంలో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించడంలేదు. బాధితులే వెళ్లి ల్యాబ్‌ల వద్ద బారులుదీరుతున్నా.. టోకెన్లు అయిపోయాయని చెబుతూ.. వచ్చిన వారిని వెనక్కి పంపుతున్నారు. మళ్లీ వచ్చి శాంపిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చినా రిజల్స్ట్‌ కోసం మరో మూడు, నాలుగు రోజులు పడుతోంది. ఈ సమయంలో ఏదైనా ఇబ్బంది వల్ల హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోతే అడ్మిట్‌ చేసుకోవడంలేదు. దీంతో
చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

For More News..

దేశంలోనే ఫస్ట్‌ కార్గో ఎక్స్‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైన్

చికెన్లో మత్తు కలిపి.. తల్లీ కూతుళ్లపై గ్యాంగ్ రేప్