
హైదరాబాద్ సిటీ, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి బయల్దేరే పలు రైళ్లను తాత్కాలికంగా ఇతర స్టేషన్లకు మారుస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 20 నుంచి 26 వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయన్నారు. సికింద్రాబాద్-పోర్ బందర్ సర్వీసును ఉందానగర్ నుంచి, సిద్దిపేట్-సికింద్రాబాద్ సర్వీసును మల్కాజిగిరి నుంచి, పుణె-సికింద్రాబాద్ సర్వీసును నాంపల్లి నుంచి నడపనున్నారు.
సికింద్రాబాద్ నుంచి బయలుదేరే దాదాపు 30 రైళ్లను చర్లపల్లి, మల్కాజ్‌గిరి, ఉందానగర్ స్టేషన్లకు తాత్కాలికంగా షిఫ్ట్ చేశారు. వీటిలో సికింద్రాబాద్- నుంచి మణుగూరు, రేపల్లె, సిలేచర్, దర్బంగా, యశ్వంత్‌పూర్, అగర్తలా, ముజఫర్‌పూర్, సంత్రగచ్చి, -దాణాపూర్, -రామేశ్వరం వెళ్లే రైళ్లతో పాటు హైదరాబాద్-రాక్సల్ సర్వీసులున్నాయి.