డిసెంబర్‌‌ నాటికి 300 – 400 మిలియన్‌ వ్యాక్సిన్‌ డోసులు

డిసెంబర్‌‌ నాటికి 300 – 400 మిలియన్‌ వ్యాక్సిన్‌ డోసులు
  • వెల్లడించిన అదార్‌‌ పూనవల్లా

న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబర్‌‌ నాటికి 300 – 400 మిలియన్ల డోస్‌ల వ్యాక్సిన్‌ రెడీ అవుతుందని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈవో అదార్‌‌ పూనవల్లా చెప్పారు. ఆస్ట్రాజెనీకా, ఆక్స్‌ఫార్డ్‌ నుంచి వచ్చే వ్యాక్సిన్‌ను డెవలప్‌ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి డోస్‌కు 10 వియాల్స్‌ ఉంటాయని చెప్పారు. “ ఇండియా, యూకేల్లో ట్రయల్స్‌ నిర్వహిస్తున్న కోవిషీల్డ్‌ మొదటి వ్యాక్సిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి” అని ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. 2021లో ఇండియాలోని అందరికీ ఈ వ్యాక్సిన్‌ చేరే అవకాశం ఉన్నట్లు ఆయన అన్నారు. ఇండియాలో దాదాపు వ్యాక్సిన్‌ ధర రూ.1000 ఉంటుందని అన్నారు. “ ట్రయల్స్‌ చాలా మంది ఫలితాలను ఇస్తున్నాయి. దానికి చాలా హ్యాపీగా ఉన్నాం. ఇండియన్‌ రెగ్యులేటరీలో లైసెన్స్‌ కోసం మరో వారంలో అప్లై చేస్తాం. పర్మిషన్‌ రాగానే ఇండియాలో కూడా ట్రయల్స్‌ మొదలు పెడతాం. వెంటనే వ్యాక్సిన్‌ తయారీ స్టార్ట్‌చేస్తాం” అని చెప్పారు. ఆక్స్‌ఫర్డ్‌లో నిర్వహించిన ఫేజ్‌ – 1, ఫేజ్‌ –2 ట్రయల్స్‌ సక్సెస్‌ అయినట్లు తెలిసిందే.