
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ దూసుకెళ్లే 300 కిలోమీటర్ల వయాడక్ట్ (రైల్వే వంతెన) పనులు పూర్తయినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన ‘ఎక్స్’ వేదికగా వీడియో పోస్ట్ చేశారు. మొత్తం 12 స్టేషన్లతో కూడిన ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం లక్షా 8 వేల కోట్లు.
300 km viaduct completed.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 20, 2025
— Bullet Train Project pic.twitter.com/dPP25lU2Gy
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి పనులు 2028కి పూర్తవుతాయి. మొత్తం 508 కిలోమీటర్ల పొడవున ఈ ట్రాక్ నిర్మిస్తున్నారు. దీనిపై ట్రైన్ గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. మూడు గంటల్లో ముంబై నుంచి అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య మొత్తం 508.17 కిలో మీటర్ల రైలు మార్గంలో దాదాపు 21 కిలోమీటర్లు భూగర్భంలోనే ఉంటుంది.
PHOTO | The Mumbai-Ahmedabad Bullet Train project has successfully completed 300 km of viaduct construction, a major milestone in India’s first high-speed rail corridor. Utilizing the advanced Full Span Launching Method (FSLM), over 257 km was built using indigenously designed… pic.twitter.com/BuxNb2C5Fh
— Press Trust of India (@PTI_News) May 20, 2025
మొత్తం 12 స్టేషన్లు కాగా.. ఇందులో 9 స్టేషన్లు గుజరాత్లో, మూడు స్టేషన్లు మహారాష్ట్రలో నిర్మించనున్నారు. బుల్లెట్ ట్రైన్ రాకపోకలు సాగించే ముంబై స్టేషన్ పూర్తిగా అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ‘ది నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ బాధ్యతలను భుజానికెత్తుకున్న సంగతి తెలిసిందే. 257.4 కిలోమీటర్లు FSLM (Full Span Launching Method) విధానంలో, 14 రివర్ బ్రిడ్జిలు SBS (Span by Span) పద్ధతిలో నిర్మిస్తున్నట్లు NHSRCL తెలిపింది. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం 401 కిలోమీటర్ల ఫౌండేషన్ వర్క్ జరిగింది.