రాష్ట్రంలో కొత్తగా 3,018 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 3,018 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మొదటిసారిగా రాష్ట్రంలో కరోనా కేసులు 3 వేలు దాటాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,018 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,11,688 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 780కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,060 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 85,223గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,685 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,113 మంది హోంఐసోలేషన్ లో ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 475, రంగారెడ్డి 247, మేడ్చల్ 204, నల్గొండ 190, ఖమ్మం 161, నిజామాబాద్ 136, వరంగల్ అర్బన్ 139, కరీంనగర్ 127, మంచిర్యాల 103, జగిత్యాల 100, కామారెడ్డి 76, జనగామ 52, భద్రాద్రి 95, మహబూబాబాద్ 60, మహబూబ్ నగర్ 56 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

కరోనాతో జగిత్యాల అడిషినల్ ఎస్పీ మృతి

హోంఐసోలేషన్ లోకి ఉత్తరాఖండ్ సీఎం

స్కాలర్‌షిప్ కు అప్లై చేయడానికి వెళ్లిన బాలికపై హత్యాచారం