ఇంగ్లీష్ ​చానెల్​లో పడవ మునిగి 31 మంది మృతి

V6 Velugu Posted on Nov 26, 2021

  • ఇంగ్లీష్ ​చానెల్​లో పడవ మునిగి 31 మంది మైగ్రెంట్స్​ మృతి
  • మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, మహిళలు

కాలే(ఫ్రాన్స్): అట్లాంటిక్ మహా సముద్రంలో బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య ఉన్న ఇంగ్లీష్ చానెల్‌‌‌‌ ను దాటే ప్రయత్నంలో బుధవారం పడవ మునిగి 31 మంది మైగ్రెంట్స్​ప్రాణాలు కోల్పోయారు. 34 మందితో వెళ్తున్న పడవ బోల్తా పడిన ఈ ఘటనలో చిన్నపిల్లలు, గర్భిణులు, మహిళలు సహా 31 మంది డెడ్ బాడీలను బయటకు తీసినట్లు ఫ్రెంచ్ హోం మంత్రి గెరాల్డ్ డర్మానిన్ తెలిపారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా వారిని హాస్పిటల్​కు తరలించినట్లు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన మైగ్రెంట్లు ఏ దేశ పౌరులు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఘటనకు సంబంధించి అయిదుగురు అనుమానిత హ్యుమన్​ట్రాఫికింగ్​నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు మంత్రి తెలిపారు. 

ఫ్రాన్స్, ​బ్రిటన్​ మధ్య లొల్లి
తాజాగా మైగ్రెంట్ల పడవ మునిగిన ఘటన ఫ్రాన్స్​, బ్రిటన్​మధ్య మరోసారి లొల్లికి దారితీసింది. బ్రిటన్​ప్రధాని బోరిస్ జాన్సన్,  ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇంగ్లీష్​చానెల్​గుండా హ్యుమన్​ట్రాఫికింగ్, అక్రమ వలసలను నిరోధించడానికి కృషి చేస్తామని గతంలో ప్రతిజ్ఞ చేశారు. అయితే బుధవారం నాటి పడవ ప్రమాదాన్ని నిరోధించడంలో ఫెయిల్ అయ్యారంటూ ఒకరినొకరు విమర్శించుకున్నారు. బ్రిటీష్ పోలీసులు, సరిహద్దు అధికారులు ఫ్రెంచ్ పోలీసులతో కలిసి చానెల్ తీరం వెంబడి జాయింట్ పెట్రోలింగ్ నిర్వహించాలన్న ప్రతిపాదనను ఫ్రాన్స్ తిరస్కరించినందుకు బ్రిటన్​అధికారులు తప్పుపడుతున్నారు. బ్రిటన్ గొడవను పెద్దది చేస్తోందని ఫ్రెంచ్ అధికారులు అంటున్నారు. బ్రిటన్ చట్టసభ సభ్యులు గురువారం ఈ విషయంపై చర్చించగా.. యూరోపియన్ యూనియన్ అధికారులతో మాక్రాన్ కూడా చర్చలు జరిపారు. 

పెరుగుతున్న వలసలు
అఫ్గానిస్తాన్, సూడాన్, ఇరాక్, ఎరిట్రియా తదితర దేశాల్లో హింస, పేదరికం తట్టుకోలేక వలస వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది బ్రిటన్‌‌‌‌లో అవకాశాలు పొందాలనే ఆశతో ఫ్రాన్స్ నుంచి చిన్న పడవల్లో ప్రమాదకరమైన రీతిలో ప్రయాణాలు చేస్తున్నారు. 2020తో పోలిస్తే ఈ ఏడాది ఇంగ్లీష్​చానెల్​ దాటి వెళ్తున్న మైగ్రెంట్ల​ సంఖ్య 3 రెట్లు పెరిగినట్లు తెలిసింది. బుధవారం ఒక్కరోజే మరో106 మందిని ఫ్రెంచ్ జలాల్లో అధికారులు కాపాడారు.

Tagged France, Britain, Migrants, atlantic ocean, boat capsize

Latest Videos

Subscribe Now

More News