సీఎం ప్రజావాణికి 311 దరఖాస్తులు..వినతులు స్వీకరించిన చిన్నారెడ్డి

సీఎం ప్రజావాణికి 311 దరఖాస్తులు..వినతులు స్వీకరించిన చిన్నారెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 311 దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 113, రెవెన్యూ శాఖకు సంబంధించి 34,  ఇందిరమ్మ ఇండ్ల కోసం 87,  మున్సిపల్ శాఖకు 24, ప్రవాసి ప్రజావాణికి ఒక దరఖాస్తు వచ్చింది. ఇతర శాఖలకు సంబంధించి 52 వచ్చాయని అధికారులు తెలిపారు. సీఎం ప్రజావాణి ఇన్​చార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులను స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.  

ల్యాబ్ టెక్నీషియన్లకు త్వరలో పోస్టింగ్స్

పోటీ పరీక్షల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 1,260 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు త్వరలో పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి తెలిపారు. మంగళవారం ప్రజా భవన్ లో జరిగిన సీఎం ప్రజా భవన్ కు భారీ ఎత్తున ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చారు. తమకు పోస్టింగ్స్ త్వరగా ఇప్పించాలని కోరారు. వైద్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడిన చిన్నారెడ్డి.. త్వరలో పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు ల్యాబ్ టెక్నీషియన్స్ కు తెలిపారు.