ముషీరాబాద్,వెలుగు: గత పాలకులు ఉద్యోగులను అరిగోస పెట్టించారని, కనీసం సమస్యలు కూడా పరిష్కరించలేదని రాష్ట్ర గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి నారాయణ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి.. ఉద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న 317 జీవోను అమలు చేయడం సంతోషకరమని.. గురువారం ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు.
