40 రోజుల్లో 32 లక్షల పెళ్లిళ్లు..రూ. 3.75లక్షల కోట్ల వ్యాపారం!

40 రోజుల్లో 32 లక్షల పెళ్లిళ్లు..రూ. 3.75లక్షల కోట్ల వ్యాపారం!

వచ్చే రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా 32 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని తెలుస్తోంది. ముహూర్తాలు నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు ఉండటంతో వివాహాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సీజన్ లో పెళ్లిళ్ల ద్వారా సుమారు 3లక్షల 75 కోట్ల లావాదేవీలు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది.

ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో దేశ వ్యాప్తంగా 35 నగరాల్లో 4 వేల 302 మంది వర్తకులు, సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరిచింది. ఒక్క ఢిల్లీలోనే ఈ సీజన్ లో 3లక్షల ఐదు వేల పెళ్లిళ్లు జరగనున్నాయని..దాని ద్వారా 75 వేల కోట్ల మేర వ్యాపారం జరిగే అవకాశం ఉందని సీఏటీఐ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. వచ్చే పెళ్ల సీజన్ వచ్చే జెలై వరకు కొనసాగుతుందిని అంచనా వేస్తున్నారు.