
కరోనా దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఎవరికి ఎలా వస్తుందో కూడా తెలియడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఒకే ఫ్యామిలీకి చెందిన 32 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరంతా బండా పట్టణంలో ఒకే ఏరియాలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ‘బండా సిటీలోని ఫుటా కువాన్ ప్రాంతంలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 32 మందికి కరోనా సోకింది. సోమవారం సాయంత్రానికి జిల్లాలో వీరితో కలిపి మొత్తం 44 మంది కరోనా బారినపడ్డారు’ అని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎన్డీ శర్మ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 807 మందికి కరోనా సోకగా.. 8 మంది మరణించారు. ప్రస్తుతానికి జిల్లాలో 360 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని.. మిగిలిన 439 మంది డిశ్చార్జ్ అయినట్లు ఆయన తెలిపారు.
For More News..