మిషన్​ భగీరథకు 32,652 కోట్ల అప్పు తెచ్చినం : రాష్ట్ర సర్కారు

మిషన్​ భగీరథకు 32,652 కోట్ల అప్పు తెచ్చినం : రాష్ట్ర సర్కారు

హైదరాబాద్, వెలుగు : మిషన్ భగీరథకు 2019 మార్చి నెలాఖరు వరకు రూ.32,652.10 కోట్ల అప్పు తీసుకున్నామని రాష్ట్ర సర్కారు వెల్లడించింది. తెలంగాణ డ్రింకింగ్​ వాటర్​ సప్లయ్​ కార్పొరేషన్  ​యాన్యువల్​ ఎకౌంట్స్​ రిపోర్టులను  శనివారం అసెంబ్లీ, కౌన్సిల్​లలో విడుదల చేశారు. 2016–17 నుంచి 2018-‌‌‌‌–‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌19  ఆర్థిక సంవత్సరాల మధ్యకాలం లో మిషన్ భగీరథ స్కీం కోసం ప్రభుత్వం చేసిన  అప్పుల వివరాలను ఆ నివేదికల్లో ప్రస్తావించారు. మిషన్​ భగీరథ పథకం కోసం ఖర్చు చేసిన మొత్తంలో 10శాతమే ప్రభుత్వం భరించగా.. మిగతా 90 శాతం నిధులను హడ్కో, నాబార్డ్, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి సమీకరించింది.

మిషన్​ భగీరథ (వాటర్ గ్రిడ్) స్కీం అమలుకు రుణ సమీకరణకు ప్రభుత్వం 2015లో తెలంగాణ డ్రింకింగ్ వాటర్​సప్లయ్​ కార్పొరేషన్ పేరుతో స్పెషల్​ పర్సస్​ వెహికిల్​ (ఎస్పీవీ)ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ గ్యారంటీతో స్కీం అమలులో భాగంగా సివిల్​ వర్క్​లు చేయడానికి లోన్​లు తెచ్చుకుంది. అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన లోన్​ల రీపేమెంట్ ఇప్పటికే ప్రారంభమైందని సర్కారు స్పష్టం చేసింది.  కరోనా తో నివేదికలు సభలో ప్రవేశపెట్టడం ఆలస్యమైందని తెలిపింది. ఈ లోన్​లను 12 ఏండ్ల పాటు 48 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉందని పేర్కొంది.  కరోనా తో  నాబార్డు  నుంచి 2 విడతల్లో తీసుకున్న లోన్​ల చెల్లింపునకు మూడేండ్లు, మరో 2 విడతల లోన్​ల రీపేమెంట్​కు రెండేళ్లు మారటోరియం తీసుకున్నారు.