వడదెబ్బతో 24 గంటల్లో 34 మంది మృతి

వడదెబ్బతో 24 గంటల్లో  34 మంది మృతి

యూపీలోని బలియాలో ఎండదెబ్బకు  ఇప్పటివరకు 34 మంది మృతి చెందారు. వడదెబ్బకు ఆస్పత్రిలో చేరి గడిచి24 గంటల్లో 34 మంది మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ  మంది60 ఏండ్లకు పైబరిన వారేనని తెలిపారు. చనిపోయిన  వారందరూ గతంలోనే కొన్ని అనారోగ్య సమస్యలున్నాయి.  వీరు ప్రస్తుత హీట్ వేవ్ ను తట్టుకోలేక మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ వంది గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ డయేరియాతో చనిపోయారు. యూపీలో విద్యుత్ కోతలతో, మంచినీరు , ఫ్యాన్లు, ఎయిర్ కండీషన్లు లేక జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యుత్ కోతలకు నిరసనగా పలువురు ఆందోళనకు దిగారు.