ఫిఫా వరల్డ్ కప్ 2022 విజేతకు రూ.344 కోట్లు

ఫిఫా వరల్డ్ కప్ 2022  విజేతకు రూ.344 కోట్లు

ఫిఫా  ఫీవర్ కొన్ని గంటల్లో ఆరంభమవుతుంది. ఖతర్ వేదికగా మెగా టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఫిఫా వరల్డ్ కప్ 2022 జరగనుంది. ఆతిథ్య ఖతర్- ఈక్వెడార్ జట్ల మధ్య మ్యాచ్​ తో వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. ఈనేపథ్యంలో ఫిఫా వరల్డ్ కప్ విజేత, రన్నరప్ కు ఎంత ప్రైజ్ మనీ దక్కుతుందో చూద్దాం.

విన్నర్ ప్రైజ్ మనీ ..

ఫిఫా వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన జట్టుకు 42 మిలియన్ డాలర్లు అందనున్నాయి. భారత కరెన్సీలో అక్షరాలా రూ. 343 కోట్లు. ఇక రన్నరప్గా నిలిచిన జట్టుకు 30 మిలియన్ డాలర్లు.. అంటే రూ. 245 కోట్లు దక్కుతాయి.  మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 27 మిలియన్ డాలర్లు  అంటే భారత కరెన్సీలో రూ. 220 కోట్లు అందుతాయి. నాల్గో స్థానంలో నిలిచిన జట్టుకు 25 మిలియన్ డాలర్లు...ఇండియన్ కరెన్సీలో  రూ. 204 కోట్లు దక్కుతాయి. 

గెలవకపోయినా..వందల కోట్లు..

ఫిఫా వరల్డ్ కప్లో 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు నిలిచిన జట్లకు 17  మిలియన్ డాలర్లు అంటే.. రూ. 138 కోట్లు చొప్పున దక్కుతాయి. ఇక  9వ స్థానం నుంచి 16వ స్థానాలను దక్కించుకున్న జట్లకు 13 మిలియన్ డాలర్లు అంటే రూ.105 కోట్లు ఇస్తారు. 17వ స్థానం నుంచి 32వ స్థానం వరకు నిలిచిన టీమ్స్ 9 మిలియన్ డాలర్లు..భారత కరెన్సీ ప్రకారం  రూ. 73 కోట్ల ప్రైజ్ మనీ అందుకోనున్నాయి.