సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా రెండు మార్పులు చేసింది. ఆదివారం (డిసెంబర్ 14) ధర్మశాల వేదికగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తుది జట్టులో స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తో పాటు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు స్థానం దక్కలేదు. అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. స్టార్ పేసర్ బుమ్రా స్థానంలో హర్షిత్ రానా ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నాడు. టాస్ టైంలో వీరిద్దరూ జట్టులో లేరని సూర్య చెప్పడంతో షాకయ్యారు. బుమ్రా, అక్షర్ ప్లేయింగ్ 11 లో లేకపోవడానికి సూర్యకుమార్ యాదవ్ కారణం చెప్పాడు.
మూడో టీ20 మ్యాచ్ కు ముందు వ్యక్తిగత కారణాలతో బుమ్రా తన సొంత నగరానికి వెళ్లిపోయాడని సూర్య వెల్లడించాడు. అయితే కారణమేంటో ఈ టీమిండియా కెప్టెన్ వెల్లడించలేదు. మరోవైపు అక్షర్ పటేల్ అనారోగ్యంతో ఈ మ్యాచ్ కు దూరమయ్యాడని సూర్య చెప్పుకొచ్చాడు. దీంతో ఈ మ్యాచ్ లో వీరిద్దరూ లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. వీరిద్దరూ నాలుగో టీ20కి అందుబాటులో ఉంటారో లేదో రేపు తెలుస్తోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 5 మ్యాచ్ ల టీ20లో భాగంగా ఇప్పటికే రెండు ముగిశాయి. తొలి మ్యాచ్ లో ఇండియా గెలిస్తే.. రెండో మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిచి సిరీస్ ను 1-1 తో సమం చేసింది. నేడు జరగనున్న టీ20లో రెండు జట్లు విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి.
టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఇంక ఎనిమిది మ్యాచ్‌లే మిగిలి ఉండటం, కెప్టెన్ సూర్య, గిల్ఫామ్లో లేకపోవడం ఇప్పుడు ఇండియాను ఆందోళనలో పడేశాయి. కాబట్టి వీలైనంత త్వరగా చీఫ్ కోచ్‌గౌతమ్‌గంభీర్‌వీటిని పరిష్కరించాలి. టాప్ఆర్డర్లో ఈ ఇద్దరిలో ఒకర్ని తప్పించి సంజూ శాంసన్‌కు చోటు కల్పించాలన్న డిమాండ్లు కూడా ఎక్కువయ్యాయి. వాస్తవంగా టెస్ట్‌కెప్టెన్‌అయిన గిల్‌ను టీ20 సెటప్‌లోకి తీసుకురావడానికి శాంసన్‌ను పక్కనబెట్టారు.
చీఫ్ సెలెక్టర్ అగార్కర్, గంభీర్ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కనీసం ఇప్పుడైనా దాన్ని సరిదిద్దుకుంటారేమో చూడాలి. మిగతా లైనప్‌లో కూడా కొద్దిగా గందరగోళం కనిపిస్తోంది. రెండో టీ20లో అక్షర్ పటేల్‌ను వన్‌డౌన్‌లో, ఆల్‌రౌండర్ శివమ్ దూబేను ఎనిమిదో స్థానంలో దించడం తీవ్రంగా బెడిసికొట్టింది.
సౌతాఫ్రికా (ప్లేయింగ్ XI):
రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్
ఇండియా (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
Axar Patel is ruled out due to illness, while Jasprit Bumrah misses the third T20I as he went back home for personal reasons. Harshit Rana and Kuldeep Yadav come into the XI. pic.twitter.com/4ZhNvjqgzO
— CricTracker (@Cricketracker) December 14, 2025
