19 రోజుల్లో 35 కేసులు.. విస్తరిస్తున్నస్వైన్ ఫ్లూ

19 రోజుల్లో 35 కేసులు.. విస్తరిస్తున్నస్వైన్ ఫ్లూ
  • రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న స్వైన్ ప్లూ
  • అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరిక
  •  2018 కంటే 2019లో పెరిగిన కేసులు
  •  ఒక్క డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోనే 43 మందికి ఫ్లూ

హైదరాబాద్, వెలుగుస్వైన్‌‌‌‌ ఫ్లూ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో 43 మంది ఫ్లూ బారిన పడగా, జనవరిలో ఈ 19 రోజుల్లోనే 35 కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కేసుల గుర్తింపు, ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కు సంబంధించి ఇచ్చిన గైడ్​లైన్స్‌‌‌‌ను తప్పకుండా పాటించాలని డాక్టర్లకు సూచించింది. స్వైన్ ఫ్లూ అనుమానిత వ్యక్తుల నుంచి శాంపిళ్లు సేకరించి, 24 గంటల్లోగా హైదరాబాద్​లోని నారాయణగూడ ఐపీఎంకు పంపించాలని, ప్రైవేటు హాస్పిటళ్లలో తీసుకున్న శాంపిళ్లను ఫీవర్ హాస్పిటల్​లోని స్వైన్ ఫ్లూ నిర్ధారణ కేంద్రానికి పంపాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ రెండు సెంటర్లకు వస్తున్న అనుమానిత కేసుల్లో 7 నుంచి 8 శాతం కేసుల్లో స్వైన్‌‌‌‌ ఫ్లూ పాజిటివ్‌‌‌‌ అని వస్తోంది. డిసెంబర్ వరకు ప్రతి వంద కేసుల్లో 3 నుంచి 5 మాత్రమే స్వైన్‌‌‌‌ ఫ్లూ పాజిటివ్ వచ్చేవని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే గతేడాది జనవరితో పోలిస్తే ఇప్పుడు ఫ్లూ విస్తరణ తక్కువగానే ఉందని, చలి తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు.

జిల్లా దవాఖాన్లలో ఐసోలేటెడ్‌‌‌‌ వార్డులు

గతేడాది డెంగీ చూపిన ఎఫెక్ట్‌‌‌‌ వల్ల హెల్త్ ఆఫీసర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లా దవాఖాన్లలో స్వైన్‌‌‌‌ ఫ్లూ ఐసోలేటెడ్ వార్డులను ఏర్పాటు చేశారు. సస్పెక్టెడ్ కేసులను ఈ ఆస్పత్రులకే తరలించి ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్నారు. అన్ని దవాఖాన్లలో ఫ్లూ మెడిసిన్‌‌‌‌, క్యాప్సుల్స్‌‌‌‌, సిరప్స్‌‌‌‌, మాస్క్​లు నిల్వ ఉంచారు. జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం, తలనొప్పి, ఒంటినొప్పులు, ఊపిరి తీసుకోలేకపోవడం, చాతిలో మంట వంటి లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్‌‌‌‌లో చేరాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గర్భిణులు, ఐదేండ్లలోపు పిల్లలు, 65 ఏండ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరిగే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. స్వైన్​ఫ్లూకు సంబంధించి ఏవైనా అనుమానాలుంటే 104 లేదా 040–24651119 నంబర్లకు ఫోన్​ చేసి తెలుసుకోవచ్చని ఆరోగ్య శాఖ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా 2019లోనే అధికం

దేశవ్యాప్తంగా 2019లో స్వైన్‌‌‌‌ ఫ్లూ కేసులు పెరిగాయి. 2018లో దేశంలో 15,266 మంది ఫ్లూ బారిన పడగా, 1,128 మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది మాత్రం 29 వేల కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ర్టంలో 2018లో 1,007 కేసులు నమో దైతే, 2019లో 1,380 కేసులు నమోదయ్యాయి. ఇందులో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

పాటించాల్సిన జాగ్రత్తలు

చేయాల్సినవి: తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి కర్చీఫ్​ను అడ్డుపెట్టుకోవాలి. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గు, జలుబు ఉన్నవారికి దూరంగా ఉండాలి. జనం ఎక్కువ ఉన్న చోట మాస్క్​లు కట్టుకోవాలి.

చేయకూడనివి: ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఎక్కడపడితే అక్కడ ఉమ్మొద్దు.

see more news కాశింతో హాని ఏముంది?. డీజీపీకి హైకోర్టు ఆదేశం