హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రేప్, పోక్సో కేసుల సత్వర విచారణ కోసం 36 ఫాస్ట్ ట్రాక్ స్పెష ల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్ పేరిట స్టేట్ లీగల్ అఫైర్స్, లెజిస్లేచర్ అఫైర్స్అండ్ జస్టిస్ సెక్రటరీ సంతోష్ రెడ్డి గురువారం జీవో జారీ చేశారు. జూలై 27వ తేదీన సుమోటో రిట్ పిటిషన్ సందర్భంగా అన్ని రాష్ర్టాల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర న్యాయ శాఖకు సుప్రీంకోర్టు ఉత్తర్వు లిచ్చింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ అన్ని రాష్ర్టాల హైకోర్టులకు లేఖలు రాసింది. ఈ లేఖలోని అంశా లను హైకోర్టు తెలంగాణ ప్రభుత్వా నికి తెలియజేసింది. దీంతో 36 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కోర్టులు అడిషనల్ డిస్ర్టిక్ట్అండ్ సెషన్స్‌జడ్జి ఆధ్వర్యం లో నడవనున్నాయి.

