
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతోంది. సరిహద్దు బలగాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 1,348 మంది జవాన్లు కరోనా బారినపడ్డారని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 33 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. ఇప్పటి వరకు కరోనాను జయించిన బీఎస్ఎఫ్ జవాన్ల సంఖ్య 817కి చేరిందని చెప్పింది. ప్రస్తుతం 526 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. ఇప్పటి వరకు ఐదుగురు బీఎస్ఎఫ్ జవాన్లు కరోనా కారణంగా మరణించారని తెలిపింది.
In the last 24 hours, 36 more Border Security Force (BSF) personnel tested positive for #COVID19 and 33 have recovered. There are 526 active cases and 817 personnel have recovered till date: Border Security Force pic.twitter.com/1W1o6Tkufj
— ANI (@ANI) July 5, 2020
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 24,850 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,73,165కి చేరింది. కరోనా కారణంగా ఇప్పటికే 19,268 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 4,09083 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 2,44,814 మంది చికిత్స పొందుతున్నారు.