తెలంగాణలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. నవంబర్ 22న 37 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రావు నేతృత్వంలో లొంగిపోయారు. ఆయుధాలతో సహా పోలీసుల ముందు లొంగిపోయారు మావోలు. మావోయిస్టుల నుంచి 303 రైఫిల్స్, జీ 3రైఫిల్స్, ఏకే 47 లు స్వాధీనం చేసుకున్నారు.
లొంగిపోయిన వారిలో కొంతమంది ఛత్తీస్ ఘడ్ వాసులు కూడా ఉన్నారని డీజీపీ శివధర్ తెలిపారు. పలువురు కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారని తెలిపారు . వీరిలో ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు వంటి అగ్ర నేతలు ఉన్నారని చెప్పారు. కోయ సాంబయ్య అలియాస్ ఆజాద్ 31 ఏండ్లుగా అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు. ఖమ్మం డివిజనల్ సభ్యులు మొత్తం తొమ్మిది మంది ఉన్నారని తెలిపారు. దక్షిణ బస్తర్ సభ్యులు 22 మంది ఉన్నారని.. ఏవోబీ ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో ఆజాద్ కీలక పాత్ర పోషించారని చెప్పారు డీజీపీ. మరో రాష్ట్ర కమిటీ సభ్యుడుఎర్రా కూడా ఉన్నారని తెలిపారు.
11 నెలలుగా 465 మంది జనజీవన స్రవంతిలో కలిశారనన్నారు. తెలంగాణకు చెందిన ఇంకా 59 మంది మావోలు అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు డీజీపీ. ప్రస్తుతం 9 మంది కేంద్ర కమిటీలో.. ఉంటే అందులో ఐదుగురు తెలంగాణ వారు ఉన్నారని తెలిపారు. 10 మంది స్టేట్ కమిటీ సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికే మావోయిస్ట్ లొంగుబాటుల్లో అగ్ర స్థానంలో తెలంగాణ ఉందన్నారు. అత్యధిక మావోయిస్ట్ లు తెలంగాణ పోలీసుల ముందే లొంగిపోయారని చెప్పారు డీజీపీ.
