మాస్టారు మీరు గ్రేట్.. హ్యాట్సాఫ్ : 20 ఏళ్లుగా నది ఈదుకుంటూ వెళ్లి చదువు చెబుతున్నాడు..!

మాస్టారు మీరు గ్రేట్.. హ్యాట్సాఫ్ : 20 ఏళ్లుగా నది ఈదుకుంటూ వెళ్లి చదువు చెబుతున్నాడు..!

డెడికేషన్​ అంటే ఇలా ఉండాలి.. చేస్తున్న వృత్తికి న్యాయం చేయాలనే ఈ మాస్టారు తపన.. అందరిలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా 20ఏళ్లుగా నదిని ఈదుతూ వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పి వస్తున్నారు ఈ మాస్టారు. ఈ సార్​ లా ఉపాధ్యాయులంతా ఉంటే ఎంత బాగుండునో అని అతని కథ విన్న తర్వాత ఎవరికైనా అనిపించక మానదు. కేరళలోని పడింజట్టుమూరికి చెందిన లెక్కల మాస్టారు అబ్దుల్ మాలిక్.. అధికారుల నుంచి ఇటీవల గుర్తింపు ,మీడియా దృష్టి ఆకర్షించడంతో మాలిక్ అసాధారణ కథ తెరపైకి వచ్చింది. ఈ మాస్టారు స్టోరీతో  గ్రామీణ ప్రాంతాల్లో టీచర్లు ఎదుర్కొంటున్న సవాళ్లు,తక్షణ చర్యల అవసరం గురించి చర్చకు దారి తీసింది. 

కేరళలోని పడింజట్టుమూరికి చెందిన గణిత ఉపాధ్యాయుడు అబ్దుల్ మాలిక్ 20ఏళ్లపైగా నదిని ఈదుకుంటూ పాఠశాలకు వెళ్తున్నాడు. ప్రతిరోజూ కడలుండి నది ఈదుకుంటూ స్కూల్​ కు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. రోడ్డు మార్గాన వెళ్లాలంటే 12 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. విద్య పట్ల ఆయనకున్న అంకితభావం - ఒక్కరోజు కూడా బోధనను మానుకోకపోవడం  మాలిక్​ మాస్టార్ని స్థానిక హీరోగా ,దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిపింది. 

బుక్స్,బట్టలను  ఓప్లాస్టిక్​ సంచిలో పెట్టుకొని మోసుకెళ్తూ, ఈత కొట్టుకుంటూ నదిని దాటుతున్నాడు. అంతేకాదు నదిని శుభ్రపర్చడం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేయడం అతని నిబద్ధతను నిరూపించుకున్నాడు. ప్రకృతిని గౌరవించడంపై విద్యార్థులకు నేర్పుతున్నాడు కూడా..

అబ్దుల్​ మాలిక్​ తన కమిట్​ మెంట్, డెడికేషన్ లో విద్యాశాఖాధికారులు  ప్రశంసలు పొందాడు. అధికారులు, మీడియా పరంగా మంచి గుర్తింపు  తెచ్చుకోవడంతో మాలిక్​ కథ తెరపైకి వచ్చింది. మాస్టారు కథ వెలుగులోరావడంతో గ్రామీణ ప్రాంతాల్లో టీచర్లు ఎదుర్కొంటున్న సవాళ్లను . పర్యావరణ చర్యల తక్షణ అవసరం గురించి  దారి తీసింది.