దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు పడిపోతోంది. రికార్డు స్థాయిలో వాయు కాలుష్యం నమోదు అవుతుంది.. పెరుగుతున్న కాలుష్యం ఢిల్లీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. AQI ప్రమాదకర స్థాయిలో 359 గా రికార్డయ్యింది. ఢిల్లీలో అన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది.. ఢిల్లీ వాసుల డైలీ లైఫ్‌ను దెబ్బతీసింది. వాయు కాలుష్యంతో ఆనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..
పెరుగుతున్న కాలుష్యంపై స్పందించిన అధికారులు.. GRAP స్టేజ్ 4 అమలు చేస్తున్న చర్యలను స్టేజ్ 3లో అమలు చేయాలని ప్రతిపాదింది. ఈ ప్రతిపాదనల్లో ప్రైవేట్ ఆఫీసులు 50 శాతం సిబ్బందితో పనిచేయాల్సి ఉంటుంది. అంటే మిగతా వారు ఇంటినుంచి పనిచేయాల్సి ఉంటుంది.
►ALSO READ | ఎయిర్‌పోర్ట్స్‌లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు.. సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం
శనివారం ఉదయం ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్ (AQI) 422గా నమోదైంది. అశోక్ విహార్‌లో 403, బావన ప్రాంతంలో 419, జహన్‌గిర్‌పురిలో 417, రోహిణిలో 414, వివేక్ విహార్‌లో 423, నెహ్రూ నగర్‌లో 402, ఐటీవో ప్రాంతంలో 370, నోయిడా సెక్టార్ 125లో 434గా ఎయిర్ క్వాలిటీ నమోదైంది.
మరోవైపు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంతో ఆరుబయట ఆటలు, ఇతర కార్యక్రమాలను నిలిపేయాలని పాఠశాలలను ఆదేశించింది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరడంతో సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ ఆదేశాలిచ్చింది.
