ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం చాలా సర్వ సాధారణంగా అలాగే తప్పనిసరిగా మారిపోయింది. పెరుగుతున్న వైద్య ద్రవ్యోల్బణం మధ్యతరగతి నుంచి వేతన జీవుల వరకు భరించలేనిదిగా మారటంతో చాలా మంది పాలసీలు కొనుక్కుంటున్నారు. అయితే అవసరమై హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు రిజెక్ట్ కాకుండా ఉండాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. క్లెయిమ్ రిజెక్ట్ అవకుండా ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం..
1. ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే ముందు దాని నిబంధనలు, వెయిటింగ్ పిరియడ్, మినహాయింపులు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఏవైనా క్లెయిమ్ అవసరమైనప్పుడు పాలసీ కింద ఏమేమి పొందగలరు.. ఏవేవి రావో కూడా తప్పక తెలుసుకోండి. కంపెనీకి పాలసీ తీసుకునే సమయంలో ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం.. పాత అనారోగ్యాలు, ప్రస్తుత హెల్త్ ఇష్యూలు, అలవాట్లు, మద్యం ధూమపానం వంటి అలవాట్ల గురించి కూడా ముందుగానే రివీల్ చేయాలి. ఏదైనా సమాచారం దాచి ఉంచితే.. సమయం వచ్చినప్పుడు క్లెయిమ్ తిరస్కరించబడుతుంది.
2. పాలసీదారుడు అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చేర్పించబడిన వెంటనే బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో ముందు అనుమతి లేకపోతే క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.అలాగే ట్రీట్మెంట్ డాక్యుమెంట్లు, రికార్డులు జాగ్రత్తగా ఉంచుకోండి. ఇవి సరిగ్గా సమర్పించకపోతే క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది.
►ALSO READ | బెంగళూరు ఇంటి ఓనర్లకు మైండ్ పోయిందా..? 3BHK అద్దె రూ.లక్షా.. మెయింటెన్స్ ఎక్స్‌ట్రా అంట..
3. పాలసీ గడువు ముగియడానికి ముందు సకాలంలో ప్రీమియం చెల్లించి రెన్యూవల్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఆలస్యమైతే పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. అప్పుడప్పుడు క్లెయిమ్ అడగాల్సిన హక్కు కూడా పాలసీదారులు కోల్పోతారు. అలాగే కొన్నిసార్లు గతంలో ఉన్న నో క్లెయిమ్ బోనస్ కూడా చేజారిపోతుంది పాలసీ రెన్యూవల్ గడువులోపు చేయకుంటే.
4. ఏజెంట్ చెప్పాడు లేదా తెలిసిన వారు చెప్పారని పాలసీని గుడ్డిగా కొనుగోలు చేయకుండా.. ఏ రోగాలకు పాలసీ మినహాయింపు ఉంటుంది లేదా ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీజ్‌లకు వెయిటింగ్ పీరియడ్ ఎంత లాంటి సమాచారం అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత పాలసీ కొనేవాళ్లపైనే ఉంటుంది. ఈ విషయాలు ముందుగానే తెలుసుకుని అవసరమైన పాలసీ మెుత్తం, అదనపు రైడర్లు కూడా యాడ్ చేసుకోవటం మంచిది. నిజాయితీతో పారదర్శకంగా పూర్తి సమాచారం పాలసీ కొనేటప్పుడే కంపెనీకి అందించటం వల్ల తర్వాతి కాలంలో క్లెయిమ్స్ తిరస్కరణకు అవకాశం తక్కువ. అలాగే కంపెనీ పాలసీ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యేలా చూసుకోవటం కూడా చాలా ముఖ్యమైనదే.
