Mahesh Babu: ‘వారణాసి’ వెనుక ఉండే నిశ్శబ్ద శక్తి నువ్వే.. హ్యాపీ బర్త్‌డే కార్త్.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

Mahesh Babu: ‘వారణాసి’ వెనుక ఉండే నిశ్శబ్ద శక్తి నువ్వే.. హ్యాపీ బర్త్‌డే కార్త్.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

ప్రస్తుతం ఇండియా నుండి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ హైపుడ్ మూవీ ఏదైనా ఉందంటే అది మహేష్ బాబు(Mahesh babu), రాజమౌళి(Rajamoulli) కాంబోలో వస్తున్న "వారణాసి" అని చెప్పాలి. టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్గా చెరగని ముద్ర వేసిన దర్శక ధీరుడు రాజమౌళి, ప్రతి ఒక్కరి కలల రాజకుమారుడిగా గుర్తింపు పొందిన మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ భారీ మైథికల్ అడ్వెంచర్ పై పీక్ లెవల్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన, ఈ సినిమా మేకర్స్ ఎటువంటి ట్వీట్ చేసిన వెంటనే సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. సరిగ్గా ఇపుడు మహేష్ బాబు పోస్ట్ చేసిన ఒక్క ట్వీట్ తో అదే జరిగింది.

ఇవాళ (2025 నవంబర్ 22న) రాజమౌళి తనయుడు, వారణాసి మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్ ఎస్ కార్తికేయ (SS Karthikeya) బర్త్ డే. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు X వేదికగా ఎస్ ఎస్ కార్తికేయకి బర్త్ డే విషెష్ తెలిపారు. వారణాసి మూవీ సెట్లో ఎస్ ఎస్ కార్తికేయతో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంటూ.. కార్తికేయని మహేష్ ఆకాశానికెత్తేశారు. 

►ALSO READ | Varanasi MM Keeravani: వారణాసిపై కీరవాణి వరుస లీకులు.. మొత్తం ఆరు పాటలు.. ఒక్కో పాట ఓ రేంజ్లో

‘‘మేము నిర్మించే ప్రతి అద్భుతం వెనుక ఉండే నిశ్శబ్ద శక్తి నువ్వే.. హ్యాపీ బర్త్‌డే కార్త్. అత్యంత కఠినమైన పనులను కూడా నువ్వు ఎంత సులువుగా, కూల్గా చక్కబెడతావో చూస్తుంటే నాకు ఎప్పుడూ ఆశ్చర్యం వేస్తుంది. ముందున్న సంవత్సరాలలో గొప్ప సక్సెస్ అందుకుంటావు” అని మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇపుడు ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

ఇటీవలే ‘గ్లోబ్‌ట్రాటర్’ పేరుతో RFC లో జరిగిన ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేయడంలోనూ కార్తికేయ తనదైన పాత్ర పోషించారు. తండ్రి రాజమౌళి ఆలోచనలకు తగ్గట్టుగా, తన పనితీరును క్రియేటివ్ గా ముందుకు తీసుకెళ్లడంలో కార్తికేయ సమర్ధుడు. ఈ విషయాన్నీ RRR మూవీతోను నిరూపించాడు. తన వాయిస్ బయటకి రాకుండా, తాను చేసే పనిలో కనబడకుండా ఉండటం అంటే.. 'సైలెంట్ మ్యాన్'గా కార్తికేయని మెచ్చుకుని తీరాల్సిందే అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే.. భారీ అంచనాలతో రూపొందుతున్న వారణాసి 2027 వేసవిలో థియేటర్లలోకి రానుంది. . రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా..కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు. దేవాకట్టా డైలాగ్స్ అందిస్తున్నారు.