- రాష్ట్ర కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి
తూప్రాన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. తూప్రాన్ కు చెందిన కమ్మరి శ్రీనివాసాచారి కాంగ్రెస్ లో చేరగా బుధవారం సాయంత్రం సెక్రటేరియట్‌లోని తన చాంబర్లో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
ఇందిరమ్మ ఇండ్లను వీలైనంత ఎక్కువ మంది పేదలు కట్టుకునేలా చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం శ్రీనివాసాచారి రచించిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జిల్లా నాయకులు మామిళ్ల కృష్ణ, నాగరాజు గౌడ్, అనిల్, ఉమర్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు
