Varanasi MM Keeravani: వారణాసిపై కీరవాణి వరుస లీకులు.. మొత్తం ఆరు పాటలు.. ఒక్కో పాట ఓ రేంజ్లో

Varanasi MM Keeravani: వారణాసిపై కీరవాణి వరుస లీకులు.. మొత్తం ఆరు పాటలు.. ఒక్కో పాట ఓ రేంజ్లో

వరల్డ్ ఆడియన్స్ మోస్ట్ ఎవైటెడ్ కాంబో మహేష్ బాబు-రాజమౌళి. వీరిద్దరి కలయికలో వస్తున్న ‘వారణాసి’పై ప్రపంచ బాక్సాఫీస్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇటీవలే ఈ పాన్‌ వరల్డ్ మైథలాజికల్ అడ్వెంచరస్‌కి సంబంధించిన అప్డేట్స్ రివీల్ అయ్యాయి.

‘వారణాసి’ అనే టైటిల్‌ను రివీల్ చేయడంతో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్, ‘వారణాసి టు ది వరల్డ్‌’ పేరుతో వీడియోను విడుదల చేసి, భారీ అంచనాలు పెంచారు మేకర్స్. అంతేకాకుండా సినిమా థీమ్ని వివరించే ‘సంచారి పాటా’ గ్లోబల్ వైడ్గా ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే ‘వారణాసి’ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ కీరవాణి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఆయన గోవాలో జరుగుతోన్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (IFFI2025) కి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కీరవాణి వారణాసి సినిమా గురించి మాట్లాడుతూ మ్యూజికల్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.

‘‘వారణాసి మూవీలో కంపోజ్ చేసే మ్యూజిక్ ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటుంది. అభిమానులు తప్పకుండా అద్భుతమైన సంగీతాన్ని వింటారు. అంతకు మించి ఇప్పుడే ఈ భారీ ప్రాజెక్ట్‌ గురించి ఏం చెప్పలేను. ‘వారణాసి’లో మొత్తం ఆరు పాటలు ఉంటాయి. ఒక్కో పాట ఊహకు అతీతంగా సాగుతాయి. మనం చేసే పనిపై స్పష్టత, నమ్మకం ఉండాలి. అప్పుడు ఎలాంటి గందరగోళం, ఒత్తిడి ఉండదు. నాకు ఈ ప్రాజెక్ట్‌ విషయంలో ఎటువంటి గందరగోళం లేదు’’ అని కీరవాణి వారణాసి విశేషాలు పంచుకున్నారు. 

ఇదిలా ఉంటే.. వారణాసి నుంచి రిలీజైన వీడియోకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు కీరవాణి. యుగాలు, ఖండాలతో కూడిన అద్భుతమైన విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సాగిన ఈ వీడియో చివర్లో.. వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో చేతిలో త్రిశూలం పట్టుకుని ఎద్దుపై వస్తున్న మహేష్బాబు లుక్‌ ఇంప్రెస్‌ చేసింది. ఈ క్రమంలో సాగిన మ్యూజిక్ ఆడియన్స్కి ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది.

‘గ్లోబ్‌ట్రాటర్’ పేరుతో RFC లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో కీరవాణి మాట్లాడుతూ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. ‘‘గ్లోబ్ అంటే ఎన్నో ఖండాలు, ఎన్నో దేశాలు, ఎన్నెన్నో వింతలు   ఉన్నాయి. వాటన్నింటిలో  ఎన్నో కొన్ని  ఇందులో చూపించబోతున్నాం. ఈ మధ్య కొత్త  ఫ్లాట్ కొన్నా.. మహేష్ బాబు ఫ్యాన్స్ హృదయాల్లో పర్మినెంట్‌గా ఉండిపోయే ఫ్లాట్‌.  2027 సమ్మర్‌‌కు గృహప్రవేశం. అందరూ రెడీగా ఉండండి’’ అని రిలీజ్ డేట్ రివీల్ చేశారు. ఇపుడు ఈ గోవా ఈవెంట్లో మ్యూజికల్ అప్డేట్ ఇచ్చి, మహేష్ ఫ్యాన్స్లో అంచనాలు పెంచుకొచ్చారు.