కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి టౌన్లో పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అధికారులు, సిబ్బందికి సూచించారు.
బుధవారం తెల్లవారు జామున శానిటేషన్ సిబ్బందితో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. పట్టణమంతా శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తెలియజేయాలన్నారు. వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
