పెర్త్ వేదికగా జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లాండ్ ను ఆస్ట్రేలియా చిత్తు చేసింది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోక విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (83 బంతుల్లోనే 123) సెంచరీతో చెలరేగి జట్టుకు వేగంగా గెలుపును అందించాడు. మార్నస్ లాబుస్చాగ్నే (51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 4న జరుగుతుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 32.5 ఓవర్లలో 172 రన్స్‌కే ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (52), ఒలీ పోప్ (46), జెమీ స్మిత్ (33), బెన్ డకెట్ (21) మాత్రమే రాణించారు. జాక్ క్రాలీ (0), జో రూట్ (0), స్టోక్స్ (6), అట్కిన్సన్ (1), బ్రైడన్ కార్స్ (6), ఆర్చర్ (0 నాటౌట్), మార్క్ వుడ్ (0) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (7/58) కెరీర్ బెస్ట్ బౌలింగ్ చేస్తే డాగెట్ 2, గ్రీన్ ఒక వికెట్ తీశాడు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. అలెక్స్ క్యారీ (26) టాప్ స్కోరర్. కామెరూన్ గ్రీన్ (24), ట్రావిస్ హెడ్ (21), స్మిత్ (17)సహా మిగతా అందరూ ఫెయిలయ్యారు. స్టోక్స్ ఐదు వికెట్లతో చెలరేగితే కార్స్ మూడు.. ఆర్చర్ రెండు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా 132 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో 40 పరుగుల లీడ్ లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కేవలం 164 పరుగులకే ఆలౌటైంది.
►ALSO READ | IND vs SA: బవుమా, స్టబ్స్ నిలకడ.. రెండో సెషన్‌లో ఇండియాకు ఒకటే వికెట్
ఒక దశలో వికెట్ నష్టానికి 65 పరుగులతో పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ లంచ్ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. స్టార్క్, బొలాండ్ విజృంభించడంతో స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయి 6 వికెట్ల నష్టానికి 88 పరులతో నిలిచింది. లోయర్ ఆర్డర్ లో అట్కిన్సన్ (37), కార్స్ (20) కాసేపు మెరుపులు మెరిపించి జట్టు స్కోర్ ను 164 పరుగులకు చేర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, డాగెట్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో స్టార్క్ రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 10 వికెట్లు తీసుకోవడం విశేషం.
205 పరుగుల టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 83 బంతుల్లోనే 123 పరుగులు చేసాడు. మార్నస్ లాబుస్చాగ్నే (51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టిన మిచెల్ స్టార్క్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Travball beats Bazball as Australia draw first blood in the Ashes!
— ESPNcricinfo (@ESPNcricinfo) November 22, 2025
The first two-day finish in an Ashes Test since 1921 😮
Scorecard: https://t.co/RFv9aTOydG pic.twitter.com/7EDCcE3y2y
