IND vs SA: బవుమా, స్టబ్స్ నిలకడ.. రెండో సెషన్‌లో ఇండియాకు ఒకటే వికెట్

IND vs SA: బవుమా, స్టబ్స్ నిలకడ.. రెండో సెషన్‌లో ఇండియాకు ఒకటే వికెట్

గౌహతి వేదికగా ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో మొదట బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా తొలి రోజు నిలకడగా ఆడుతోంది. తొలి రెండు సెషన్ లో వికెట్లను ప్రాధాన్యత ఇస్తూ జాగ్రత్తగా ఆడింది. కెప్టెన్ బవుమా, స్టబ్స్ రెండో సెషన్ లో పట్టుదల చూపించడంతో సౌతాఫ్రికా తొలి రోజు రెండో సెషన్ ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రీజ్ లో బవుమా (36), స్టబ్స్ (32) ఉన్నారు. ఇండియా బౌలర్లలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. రెండో సెషన్ లో ఇండియా ఒక వికెట్ మాత్రమే రాబట్టింది. మరోవైపు సౌతాఫ్రికా 74 పరుగులు రాబట్టింది. 

వికెట్ నష్టానికి 82 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆరంభంలోనే ర్యాన్ రికెల్టన్ (32) వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ క్రీజ్ లో పాతుకుపోయిన ఈ సఫారీ ఓపెనర్ ను ఔట్ చేసి తొలి ఓవర్ లోనే బ్రేక్ ఇచ్చాడు. ఈ దశలో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ను బవుమా (36), స్టబ్స్ (32) ముందుకు తీసుకెళ్లారు. పరుగులు రాకపోయినా వికెట్ కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో వీరి భాగస్వామ్యం 50 పరుగులు దాటింది. ఎంత ప్రయత్నించినా వీరి భాగస్వామ్యాన్ని రెండో సెషన్ లో ఇండియా విడగొట్టలేకపోయింది. నాలుగో వికెట్ కు వీరిద్దరూ అజేయంగా 166 బంతుల్లో 74 పరుగులు జోడించి భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. 

తొలి సెషన్ లోనూ సఫారీలదే హవా:
 
అంతకముందు తొలి సెషన్ లోనూ టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. టాస్ ఓడిన మన జట్టు తొలి సెషన్ ను పేలవంగా ఆరంభించింది. సౌతాఫ్రికా ఓపెనర్లు భారత బౌలర్లను తొలి సెషన్ లో సమర్ధవంతంగా అడ్డుకోవడంతో టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. 38 పరుగులు చేసిన మార్కరంను బుమ్రా ఔట్ చేసి టీ బ్రేక్ ముందు బ్రేక్ ఇచ్చాడు. తొలి వికెట్ కు సఫారీ ఓపెనర్లు 82 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు.