తుర్కపల్లిలోని శ్రీదుర్గ వైన్స్​లో రూ.3.70 లక్షలు చోరీ 

తుర్కపల్లిలోని శ్రీదుర్గ  వైన్స్​లో రూ.3.70 లక్షలు చోరీ 

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా తుర్కపల్లిలోని శ్రీదుర్గ వైన్స్​షాపులో రూ.3.70 లక్షలు చోరీ అయ్యాయి. శనివారం రాత్రి 10 గంటలకు అమ్మిన నగదును కౌంటర్​లో పెట్టి తాళం వేసి ఇంటికెళ్లారు. అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు వచ్చి వైన్స్ షాప్​షట్టర్ తాళాలు పగలగొట్టి కౌంటర్​లోని నగదు, కొన్ని లిక్కర్​ బాటిళ్లను ఎత్తుకెళ్లారు.

ఆదివారం విషయం తెలుసుకున్న షాప్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పుటేజీని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.