
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అయితే మినీ ఇండియాగా పేరున్న మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో మాత్రం మధ్యాహ్నం మూడు గంటల వరకు 37.69శాతం పోలింగ్ నమోదైంది. ఈ పార్లమెంట్ స్థానంలో ఉన్న మేడ్చల్ లో 42.6 శాతం, మల్కాజిగిరిలో 33.68 శాతం, కుత్బుల్లాపూర్ లో 35.1శాతం, కూకట్ పల్లిలో 39.65 శాతం, ఉప్పల్ లో 39.28 శాతం, ఎల్బీ నగర్ లో 34.82 శాతం, సికింద్రాబాద్ లో 39.92 శాతం పోలింగ్ నమోదైంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు మూడు గంటల వరకు 39.92 శాతం పోలింగ్ నమోదైంది. ఇక హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటివరకు - 29.47% నమోదైంది.