
హైదరాబాద్, వెలుగు : నేషనల్ లోక్‌అదాలత్‌లో భాగంగా తెలంగాణ హైకోర్టు ఇతర అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్ ల్లో 39,24,107 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో ప్రీలిటిగేషన్ కేసులు 32,65,220, పెండింగ్ కేసులు 6,58,887 ఉన్నాయి. లబ్ధిదారులకు రూ.190 కోట్ల చెల్లింపులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి.
హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, న్యాయమూర్తులు జస్టిస్ పి.శ్యామ్ కోస్టి, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల పర్యవేక్షణలో లోక్‌అదాలత్‌ల నిర్వహణ జరిగింది. ఈ మేరకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఎస్.గోవర్ధన్‌రెడ్డి ఒక ప్రకటన జారీ చేశారు.